NTV Telugu Site icon

Assam Flood: అస్సాంలో క్లిష్ట పరిస్థితులు.. ఎటు చూసినా నీళ్లే.. జనాలు తీవ్ర ఇక్కట్లు

Floods

Floods

అస్సాంను భారీ వరదలు ముంచెత్తాయి. ఊళ్లు చెరువులయ్యాయి. ఎటు చూసినా నీళ్లే. కాలు కదపలేని పరిస్థితి. ఇంకో వైపు విష పురుగులు, జంతువుల సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలా 30 జిల్లాల్లో పరిస్థితులు క్లిష్టంగా మారిపోయాయి. దాదాపు 24.5 లక్షల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. ఇంకో వైపు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా రంగంలోకి శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితుల్ని పరామర్శించి అండగా నిలుస్తున్నారు. ఇక దిబ్రూఘర్ జిల్లా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని వరద పరిస్థితిని సమీక్షించారు.

ఇది కూడా చదవండి: Brain-Eating Amoeba: ప్రాణాంతక ‘‘మెదడును తినే అమీబా’’ .. కేరళలో 4వ కేసు నమోదు..

30 జిల్లాల్లో 24.50 లక్షల మంది ప్రజలు వరదలో కొట్టుమిట్టాడుతున్నారని, అనేక చోట్ల ప్రధాన నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని, అస్సాం వరద పరిస్థితి ఈరోజు క్లిష్టంగా ఉందని ప్రభుత్వం నుంచి అధికారిక బులెటిన్ విడుదలైంది. ఇక వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

ఇది కూడా చదవండి: Rahul Gandhi: ప్రధాని మోడీ అయోధ్య నుంచి పోటీ చేస్తే.. పొలిటికల్ కెరీర్ ముగిసేది..

కాచర్, కమ్రూప్, హైలకండి, హోజై, ధుబ్రి, నాగావ్, మోరిగావ్, గోల్‌పరా, బార్‌పేట, దిబ్రూఘర్, నల్బరీ, ధేమాజీ, బొంగైగావ్, లఖింపూర్, జోర్హాట్, సోనిత్‌పూర్, కోక్రాఝర్, కరీంనగర్, దక్షిణ సల్మారా, దర్రాంగ్, టిన్సుకియా జిల్లాలు వరదల బారిన పడ్డాయి. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బులెటిన్ ప్రకారం.. ఈ సంవత్సరం వరదలు, కొండచరియలు, తుఫానులలో 64 మంది మరణించారని తెలిపింది.

ఇది కూడా చదవండి: OSD Rama Rao: పీసీబీ ఫైల్స్ దహనం కేసులో ఓఎస్డీ రామారావుపై కేసు నమోదు..