Site icon NTV Telugu

Himanta Biswa Sarma: కేసీఆర్ చంద్రుడి మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. దేశంలో సాధ్యం కాదు..

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: కుటుంబ పార్టీలు వారి కోసమే ఆలోచిస్తాయని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. కేసీఆర్‌ కొత్త పార్టీ పెట్టుకోవచ్చని.. దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసే ఉన్నాయని.. కొత్తగా కేసీఆర్ వారిని ఏకం చేయాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నయా నిజాం పరిపాలనను తెలంగాణలో అంతం చేస్తామన్నారు. 2024 లో అధికారంలోకి వచ్చేది మోడీనే ఆయన జోస్యం చెప్పారు.

దేశం ఏకంగానే ఉందన్న ఆయన.. రాహుల్‌కి నిజంగా దేశ భక్తి ఉంటే.. 1947 విభజన ఎక్కడ జరిగిందో అక్కడ యాత్ర చేయాలన్నారు. కుటుంబ పార్టీలు బిడ్డ కూతురు గురించి తప్ప దేశం కోసం ఆలోచించవన్నారు. బీజేపీని దేశ ప్రజల నుంచి ఎవరూ వేరు చేయలేరన్నారు. పార్టీలను ఏకం చేయడం కోసం కేసీఆర్ తిరుగుతుంటే.. బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజల్ని ఏకం చేయడానికి 50 ఏళ్లు పడుతుందేమో అని ఆయన అన్నారు. దేశ ప్రధానిగా మోడీ ఉన్నాడు.. భవిష్యత్‌లో కూడా ఉంటాడన్నారు. ఇంకో ముప్పై ఏళ్ల వరకు బీజేపీ అధికారంలో ఉంటుందన్నారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడవుతారా?.. ఈ ప్రశ్నకు ఆయన ఏమన్నారంటే?

కెసిఆర్ చంద్రుని మీదనో, సూర్యుని మీదనో సముద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కుంటే చేసుకోవాలి.. కానీ దేశంలో సాధ్యం కాదన్నారు. కేసీఆర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు.. అందుకే జాతీయ పార్టీ అని అంటున్నాడన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని… లేకుంటే దేశంలో ఎక్కడ తిరిగిన గౌరవం లభించదన్నారు. ఈడీ, సీబీఐ గురించి మాట్లాడే వారికి అవి అంటే భయం ఉందని… తప్పు చేయకపోతే వాళ్ల కార్యాలయానికి వెళ్లి కాగితాలు చూపెట్టి వచ్చు కదా అన్నారు.

Exit mobile version