Pakistan: భారత్‌పై దాడిని ‘‘ఘజ్వా-ఎ-హింద్’’గా అభివర్ణించిన పాక్ చీఫ్..
- ఆపరేషన్ సిందూర్‌ను ‘‘ఘజ్వా ఎ హింద్’’గా అభివర్ణించిన పాక్ ఆర్మీ చీఫ్..
- సంచలన ప్రకటన చేసిన జైషే మహ్మద్ ఉగ్రవాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ భారత్‌పై ఎలాంటి వ్యతిరేకతను ప్రదర్శించాడో, జైషే మహ్మద్ ఉగ్రవాది చెప్పడం సంచలనంగా మారింది. ఆపరేషన్ సిందూర్ కు ప్రతిగా పాక్ ప్రారంభించిన దాడుల్ని ‘‘ఘజ్వా-ఎ-హింద్’’గా అభివర్ణించాడని జైష్ ఉగ్రవాది ఇలియాస్ కాశ్మీరీ అన్నాడు. భారతదేశంపై మతపరమైన యుద్ధం చేసి, ఇస్లామిక్ పాలన స్థాపించాలనే సిద్ధాంతాన్ని ‘‘ఘజ్వా ఎ హింద్’’ సూచిస్తుంది. ఫిబ్రవరి 5న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని రావల్‌కోట్‌లో ఉగ్రవాదుల సమావేశంలో కాశ్మీరీ అన్నారు.
Read Also: Vivo V70 Elite Look: ప్యాషన్ రెడ్‌లో అదిరిపోయే లుక్.. అందరి చూపులన్నీ ‘వివో వీ70 ఎలైట్’పైనే!
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
‘‘యుద్ధం మొదలైనప్పుడు, ఆయుధాలు బయటకు వచ్చాయి, యుద్ధ విమానాలు దాడి చేసుకున్నాయి. ట్యాంకులు ముఖాముఖిగా నిలబడ్డాయి. మన ఆర్మీ చీఫ్ దీనిని ఘజ్వా ఎ హింద్, అని, బున్యాన్ అల్ మర్సూస్ అని ప్రకటించాడు’’ అని కాశ్మీరీ చెప్పాడు. ఉగ్రవాదుల గుర్తింపు జిహాద్ అని, ప్రభుత్వం తమతో ఉన్నా లేకపోయినా మన లక్ష్యం జిహాద్ అని, కాశ్మీర్‌ను విముక్తి చేస్తామని చెప్పాడు.
జైషే ఉగ్రవాది ప్రకటనతో మరోసారి పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదుల సంబంధాలు బయటపడ్డాయి. ఇటీవల నెలల్లో పాకిస్తాన్‌లోని పలువురు ఉగ్రవాదులు భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ లో 26 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, పాకిస్తాన్‌పై భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభించింది. పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడుల్లో వందకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్ కవ్వింపులకు దిగడంతో పాక్ వైమానిక దళానికి చెందిన 10కి పైగా ఎయిర్ బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!