2020 ఢిల్లీ అల్లర్లలో పోలీసులకు తుపాకీ గురిపెట్టి ప్రాచుర్యం పొందిన నిందితుడు షారుక్ పఠాన్ కుటుంబాన్ని ఢిల్లీ ఎంఐఎం పార్టీ చీఫ్ డాక్టర్ సోయబ్ జమై కలిశారు. ఇప్పుడు ఈ కలయిక వివాదాస్పదంగా మారింది. అల్లర్ల సమయంలో పోలీసులకు తుపాకీని గురిపెట్టిని ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెహాద్ ఉల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) రాబోయే ఢిల్లీ అసెంబ్లీలో మాజీ ఆప్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌ని నిలబెట్టింది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితుడి ఉన్న హుస్సేన్‌ని ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించింది. కౌన్సిలర్‌గా ఉన్న తాహిర్ హుస్సేన్‌ని ఆప్ బహిష్కరించింది. ఇప్పుడు ఈ అభ్యర్థిత్వం వివాదాస్పదంగా మారింది.
Delhi Riots Case: 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ సమయంలో ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మను అత్యంత దారుణంగా హత్య చేశారు. చాంద్ బాగ్ పులియా సమీపంలోని ఖజూరి ఖాస్ డ్రెయినేజ్ కాలువ నుంచి అంకిత్ శర్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఈ హత్య సంచలనంగా మారింది. అంకిత్ శర్మ హత్యకు సంబంధించి ఆమ్ ఆద్మీ నేత తాహిర్ హుస్సెన్, మరో 10 మందిపై ఢిల్లీ కోర్టు గురువారం కిడ్నాప్, మర్డర్ అభియోగాలను…