Site icon NTV Telugu

Asaduddin Owaisi: కొత్త పార్లమెంట్‌ని శవపేటిక అని తిడతారా..? ఆర్జేడీపై ఓవైసీ ఫైర్

Asduddin Owaisi

Asduddin Owaisi

Asaduddin Owaisi: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు ప్రారంభించారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్మానించకుండా ప్రధాని పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం ఏంటని..? ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. ఈ కార్యక్రమాన్ని 20కి పైగా ప్రతిపక్షాలు బహిష్కరించాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, ఎస్పీ, జేడీయూ, శివసేన(ఉద్ధవ్), టీఎంసీ, ఆప్, ఆర్జేడీ పార్టీలు ఈ జాబితాలో ఉన్నాయి.

Read Also: New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

ఇదిలా ఉంటే లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీ పార్టీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ‘శవపేటిక’తో పోలుస్తూ విమర్శించింది. ఈ విమర్శలపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్జేడీకి స్టాండ్ లేదని, పాత పార్లమెంట్ భవనానికి ఢిల్లీ ఫైర్ సర్వీస్ నుంచి క్లియరెన్స్ కూడా లేదని, ఆర్జేడీ పార్లమెంట్ను శవపేటిక అని ఎలా పిలుస్తారంటూ మండిపడ్డారు. వేరే విధంగా విమర్శలు చేయవచ్చని, మీరు ఇలాంటి కోణంలో ఎందుకు విమర్శలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

అయితే కొత్త పార్లమెంట్ ను ప్రధాని మోడీకి బదులుగా లోక్ సభ స్పీకర్ ప్రారంభిస్తే బాగుండేదని ఆయన అన్నారు. లోక్‌సభకు స్పీకర్ సంరక్షకుడు, ప్రధాని కాదు, లోక్‌సభ ప్రజలకు జవాబుదారీగా ఉంటుందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కానీ ప్రధానమంత్రి అన్ని నేనే చేస్తున్నానని, 2014 కి ముందు ఏం జరగలేదని చూపించాలని అనుకుంటున్నారని, ఇప్పుడే అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు చూపిస్తున్నారంటూ విమర్శించారు. ఇది ప్రధాని వ్యక్తిగత ప్రమోషన్ అంటూ విమర్శించారు.

Exit mobile version