New Delhi: దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ప్రేత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది పార్లమెంట్. చారిత్రాత్మక అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకునే దిశగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేథ్యంలో కొత్త పార్లమెంట్ భవనంలో మంగళవారం అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకు రాజ్యాంగం కాపీలను అందజేసింది. కాగా ఇందులో సామ్యవాద, లౌకికవాద అనే పదాలు కనిపించకపోవడంతో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విషయం పైన కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర రంజన్ చౌదరీ స్పందిస్తూ సెంట్రల్ విస్టాలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో రాజ్యాంగ కాపీలను కొత్తగా ముద్రించి అందజేశారని, కానీ వాటి పీఠికలో సోషలిస్టు, సెక్యూలర్ పదాలు లేవని ఇది రాజ్యాంగంపై జరిగిన దాడి అంటూ ఆరోపించారు.
Read also:AP BJP: మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏపీ బీజేపీ మహిళా నేతల సంబరాలు
1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్ట్ (సామ్యవాదం), సెక్యులర్ (లౌకికవాదం) పదాలను పీఠికలో జోడించుకున్నామని, రాజ్యాంగ పీఠికలో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది వెల్లడించారు.ప్రభుత్వం ఉద్దేశం అనుమానాస్పదంగా ఉందని, చాలా తెలివిగా ఈ పనిచేశారని ఆయన ధ్వజమెత్తారు. కాగా హిందీ కాపీలలో పదాలు మిస్ కాలేదు. కాగా మరోవైపు ఈ అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘావల్ స్పందిస్తూ.. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సోషలిస్ట్, సెక్యులర్ పదాలు లేవన్నారు. 1976లో జరిగిన 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదాలను చేర్చామని ఆయన గుర్తుచేశారు