మందు బాబులు ఇంట్లో మందు తాగేటప్పుడు స్టఫ్‌గా కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం కామన్. ముఖ్యంగా ఫ్రైడ్ మాంసం, హాట్ చిప్స్, మిక్చర్ వంటి కారం పదార్థాలు తింటుంటారు. ఇవి లేకపోతే ఆఖరికి ఆవకాయను టేస్ట్ చేస్తుంటారు.

అదే బార్‌లో మందు తాగేటప్పుడు అక్కడి సిబ్బంది ఉప్పు వేరుశెనగలను (సాల్ట్ పల్లీలు) ఇస్తారు. ఇది మోస్ట్ కామన్ స్టఫ్‌గా పాపులర్ అయింది. వీటిని సర్వ్ చేయడానికి రీజన్ ఒక బిజినెస్ ట్రిక్. 

ఉప్పగా ఉండే వేరుశనగలు లిక్కర్ తాగిన తర్వాత సంతృప్తిని మరింత మెరుగుపరుస్తాయి. ఎందుకంటే అవి క్రంచ్‌ను ఫీలింగ్‌ను అందిస్తాయి. మందు తాగుతున్నప్పుడు తరచుగా వేరుశెనగలు, జంతికలు లేదా చిప్స్ వంటి ఉప్పుకారం కలగలిసిన చిరుతిండిని మందుబాబులు తినడానికి ఆసక్తి చూపుతుంటారు. 

ఆల్కహాల్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఉప్పు లేదా కారంగా ఉండే ఆహారాలను తినాలనే కోరికను తెస్తుంది. అందుకు తగ్గట్టుగానే బార్లలో ఉప్పు వేరుశనగలను అందిస్తుంటారు.

వేరుశెనగలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలోకి ఆల్కహాల్ శోషణను నెమ్మదిస్తాయి. ఫలితంగా మత్తు ప్రభావం తగ్గడమే కాకుండా శరీరంపై ఆల్కహాల్ ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. బార్‌లలో మందుబాబులు తాగి పడిపోకుండా ఉండటం కోసం వేరుశనగలను సర్వ్ చేస్తుంటారు.

ఉప్పు సహజంగా నీటిని పీల్చుకుంటుంది. ఉప్పగా ఉండే స్నాక్స్ తినడం వల్ల నోరు, గొంతు పొడిబారుతుంది. ఈ పరిస్థితిలో దాహంగా అనిపిస్తుంది. 

సాధారణంగా లిక్కర్స్ రుచికి చేదుగా ఉంటాయి. వాటిని తాగేటప్పుడు ఉప్పగా ఉండే స్నాక్స్ తింటే చేదు రుచి తాతాల్కికంగా తగ్గుతుంది. దీంతో మందు బాబులు ఎక్కువగా తాగడానికి అవకాశం ఉంటుంది. 

అందుకే బార్ల యాజమాన్యాలు తమ బిజినెస్ పెంచుకోవడానికి స్టఫ్‌గా ఉప్పు వేరుశెనగలను అందిస్తుంటాయి. అంతేకాకుండా..  వేరుశనగలు తక్కువ ధరకే లభిస్తాయి. 

పల్లీలను సులభంగా నిల్వ చేయవచ్చు. తక్కువ ఖర్చుతో బెస్ట్ స్నాక్‌ను అందించాలనే ఉద్దేశంతో బార్ల యాజమాన్యాలకు వేరుశనగలు మంచి ఎంపికగా మారాయి.

ఉప్పగా ఉండే స్నాక్స్ కారణంగా తీవ్రమైన దాహం, మరో డ్రింక్ సిప్ చేసేలా ప్రోత్సహిస్తుంది. ఇది ఫ్రైడ్‌ఫుడ్ ఆర్డర్ చేసేలా ప్రేరేపించవచ్చు. 

ఉప్పు అనేది శరీర ద్రవాల బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తుంది. డీహైడ్రేషన్ ముప్పును పెంచుతుంది. కోల్పోయిన ద్రవాలు, పోషకాలను తిరిగే పొందేలా మిమ్మల్ని మరింత తాగేలా, తినేలా ప్రోత్సహిస్తుంది.