Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- గోవా ఎన్నికల్లో ఆప్ గెలిస్తే E20 పెట్రోల్‌ను నిషేధిస్తామని కేజ్రీవాల్ హామీ.
- ప్రభుత్వం ఏర్పడిన ఐదు రోజుల్లోనే E20 విక్రయాలను నిలిపివేస్తామని ప్రకటన.
- E20 వల్ల ఇంజిన్, ఫ్యూయల్ సిస్టమ్ దెబ్బతింటున్నాయని కేజ్రీవాల్ ఆరోపణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధికారంలోకి వస్తే గోవాలో 5 రోజుల్లో E20 పెట్రోల్‌ను నిషేధిస్తామని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం హామీ ఇచ్చారు. ఈ హామీతో గోవాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గోవాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా E20 టౌన్‌హాల్ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. 2027 మార్చి 10 తర్వాత గోవాలో ఆప్ సర్కార్ ఏర్పడితే ఇథనాల్ కలిపిన పెట్రోల్ నిలిపేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. అలా చేయకపోతే రాజకీయల నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించారు.
40 అసెంబ్లీ స్థానాలు ఉన్న గోవాలో ఆప్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. 2027 మార్చిలో ఆ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్లు, ఫ్యూయల్ సిస్టమ్‌లు దెబ్బతింటున్నాయని, మైలేజీ గణనీయంగా తగ్గుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు.
Also Read
మరోవైపు, కేంద్రం ఈ వాదనల్ని ఖండించింది. దేశీయంగా ఇథనాల్ ఉత్పత్తిని పెంచడం, ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం, కర్బన ఉద్గారాలను తగ్గించడమే లక్ష్యమని కేంద్రం చెబుతోంది. అనేక పరీక్షలు నిర్వహించిన తర్వాత E20ని తీసుకువచ్చామని, వాహనాల్లో ఈ ఇంధనం సురక్షితమే అని చెప్పింది. ఇదే కాకుండా ఇథనాల్ బ్లెండింగ్ వల్ల చక్కెర మిల్లలకు, చెరుకు రైతులకు ప్రత్యామ్నాయ మార్కెట్ లభిస్తుందని కేంద్రం చెబుతోంది.
తాజావార్తలు
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!