Smartphone: భారత్ స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి, ఎగుమతుల్లో దూసుకుపోతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఏకంగా రూ. 2 లక్షల కోట్ల స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి అయ్యాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం తెలిపారు. ఈ ఎగుమతుల్లో దాదాపుగా రూ. 1.5 లక్షల కోట్ల విలువైన ‘‘ఐఫోన్’’ షిప్‌మెంట్లు ఉన్నాయని వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంతో చూస్తే స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు 54 శాతం వృద్ధి సాధించినట్లు కేంద్రమంత్రి అన్నారు. గత 10 ఏళ్లలో భారత దేశంలో ఎలక్ట్రానిక్స్…
iPhones: భారతదేశం నుంచి ఆపిల్ ఐఫోన్ల ఎగుమతులు పెరిగాయి. ఆరు నెలల్లో మూడో వంతు పెరిగాయి. ఇది భారతదేశంలో తయారీ రంగాన్ని విస్తరించడానికి, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడాన్ని సూచిస్తోంది. భారత్ నుంచి ఏకంగా 6 బిలియన్ డాలర్ల ఐఫోన్ ఎగుమతులు జరిగినట్లు తెలిసింది. గతేడాదితో పోలిస్తే ఇది మూడో వంతు పెరుగుదల అని సంబంధిత వర్గాలు చెప్పాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 10 బిలియన్ డాలర్లను అధిగమించేలా ఎగుమతులు ఉండబోతున్నాయి.