Site icon NTV Telugu

Khalistan Terrorist: కెనడా నుంచి హిందువులను పంపించేయండి.. ఖలిస్థానీల డిమాండ్!

Kalistan

Kalistan

Khalistan Terrorist: కెనడా దేశంలో ఖలిస్థానీలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఆ దేశం నుంచి 8 లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలంటూ వేర్పాటు వాదులు టొరొంటోలోని మాల్టన్ గురుద్వారాలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాళ్లు భారత ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షా, విదేశాంగ మంత్రి జై శంకర్‌ బొమ్మలను అభ్యంతరకర రీతిలో ఓ పంజరంలో పెట్టారు.

Read Also: Sangareddy: ఇద్దరు పిల్లలకు ఉరి వేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. కారణం అదే!

అయితే, ఇటీవల ఖలిస్థానీ మద్దతుదారులు ఓ మందిరంలో విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం జరిగింది. కెనడాలోని హిందూ సమాజానికి చెందిన ఓ నాయకుడు షవన్‌ బిండా ఈ వీడియోను ఎక్స్‌ (ట్విట్టర్) లో పోస్టు చేశారు. ఇది భారత ప్రభుత్వంపై చేస్తున్న ఆందోళన కాదు.. ఖలిస్థానీ గ్రూపునకు ఉన్న హిందూ వ్యతిరేకత అని పేర్కొన్నారు. కెనడాలో జరిగిన అతి భయంకరమైన దాడికి ఈ గ్రూపే కారణమని రాసుకొచ్చారు. కనిష్కా బాంబింగ్‌ ఘటనను గుర్తు చేస్తూ అతడు ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: CPI Narayana: బిగ్ బాస్, అందాల పోటీలతో స్త్రీ జాతికి కళంకం.. బ్యాన్‌ చేయాలి..!

కాగా, కెనడాకు చెందిన విలేకరి డానియల్‌ బోర్డమన్‌ కూడా హిందూ వ్యతిరేకతను రెచ్చగొడుతూ ఖలిస్థానీలు నిర్వహించిన కార్యక్రమం వీడియోను నెట్టింట షేర్‌ చేశారు. అంతేకాదు ఖలిస్థానీలపై చర్యలు తీసుకోవడంలో కొత్త ప్రధాని మార్క్‌ కార్నీకి.. మాజీ ప్రధాని ట్రూడోకు ఏమైనా తేడా ఉందా అని క్వశ్చన్ చేశారు. ఖలిస్థానీలు భారత్ కు చెందిన కేంద్ర మంత్రులను బెదిరించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల రైల్వేశాఖ సహాయమంత్రి రవనీత్‌ సింగ్‌ బిట్టూను హత్య చేయడానికి కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించారు. సోషల్ మీడియాలో లీకైన కొన్ని స్క్రీన్‌ షాట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపాడు. కేంద్ర మంత్రి అమిత్‌షాపై కూడా ఖలిస్థానీ సంస్థ వారిస్‌ పంజాబ్‌దే నాయకులు కక్ష పెంచుకొన్నట్లు చెప్పుకొచ్చాడు.

Exit mobile version