NTV Telugu Site icon

Katchatheevu: “కచ్చతీవు”పై ఇందిరా గాంధీని ప్రశంసించిన కాంగ్రెస్.. అన్నామలై తీవ్ర విమర్శలు..

Katchatheevu

Katchatheevu

Katchatheevu: లోక్‌సభ ఎన్నికల ముందు తమిళనాడులో చర్చనీయాంశంగా మారిన ‘‘కచ్చతీవు’’ దీవుల వ్యవహారం మరోసారి రాజకీయాంశంగా మారింది. 1974లో భారత సార్వభౌమాధికారం కింద ఉన్న కచ్చతీవు ద్వీపాన్ని అప్పటి ప్రధాని ఇండిరా గాంధీ శ్రీలంకకు అప్పగించింది. ఈ నిర్ణయాన్ని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అళగిరి సెల్వపెరుంతగై ప్రశంసించారు. దీనిపై బీజేపీ తమిళనాడు చీఫ్ కే. అన్నామలై తీవ్ర విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు డీఎంకేల ఏకపక్ష, పేలవమైన ఆలోచన రహిత నిర్ణయాలని అన్నామలై విమర్శించారు. ఈ నిర్ణయం ద్వారా తమిళ జాలర్ల జీవనోపాధిని ప్రమాదంలో పడేసిందని దుయ్యబట్టారు. ఎక్స్‌లో కాంగ్రెస్, డీఎంకేలపై విరుచుకుపడ్డారు. ‘‘ కాంగ్రెస్, డీఎంకేల నిర్ణయం మన మత్స్యకారుల ప్రాణాలను బలిగొందని, నిరంతరం అరెస్టులు, మన ఫిషింగ్ బోట్లకు నష్టం కారణంగా చాలా మంది జీవనోపాధిని కోల్పోయారని సెల్వపెరుంతగై గ్రహించారా..?’’ అని ప్రశ్నించారు.

Read Also: Land Registration Values: భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేందుకు కసరత్తు.. ఆ ప్రాంతానికి మినహాయింపు..!

మనదేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి ప్రధాని నరేంద్రమోడీ అవిశ్రాంతంగా కృషి చేస్తు్న్నారని, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారని అన్నారు. గత కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాంతాలు నిర్లక్ష్యం చేయబడ్డాయని అన్నామలై ఆరోపించారు. కచ్చతీవు దీవుల విషయంలో కాంగ్రెస్ నాయకుడి వైఖరిని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సమర్థిస్తారా..? అని ప్రశ్నించారు.

1974 ఇండో-శ్రీలంక సముద్ర ఒప్పందం ప్రకారం శ్రీలంకకు అప్పగించబడిన 285 ఎకరాల జనావాసాలు లేని ద్వీపమైన కట్చతీవు వివాదాస్పద అంశంగా మిగిలిపోయింది, ముఖ్యంగా తమిళనాడులో, ఈ చర్య తమిళ జాలరులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ పార్టీలు నిరంతరం విమర్శిస్తున్నాయి. ఈ దీవిని శ్రీలంకకు అప్పగించడం ద్వారా మన వ్యూహాత్మక అవసరాలు దెబ్బతిన్నాయని రక్షణ రంగ నిపుణులు భావిస్తారు.