Site icon NTV Telugu

Anant ambani wedding: షెర్వానీ, స్పోర్ట్స్ షూస్‌తో వేదిక దగ్గరకు చేరిన అనంత్

Sports

Sports

పెళ్లికొడుకుగా అనంత్ అంబానీ ముస్తాబై.. కళ్యాణ మండపానికి చేరుకున్నాడు. అంతకముందు ఇంటి నుంచి అలంకరింపబడిన పూల వాహనంలో అనంత్ అంబానీ బ్యాండ్‌మేళం, డ్యాన్స్‌లతో పెద్ద ఊరేగింపుగా బయల్దేరి మండపానికి చేరుకున్నాడు.

ఇది కూడా చదవండి: Anant ambani wedding: రాధిక గురించి అత్తగారు నీతా మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్

పెళ్లి కొడుకు మస్తాబులో అనంత్ అంబానీ మెరిసిపోయాడు. నారింజ రంగు షేర్వానీ, గోల్డెన్ ఎలిమెంట్స్‌తో అలంకరించబడిన స్పోర్ట్స్ షూతో ప్రత్యేకంగా రెడీ అయ్యాడు. సంప్రదాయ వస్త్రధారణతో కళ్యాణమండపానికి చేరుకున్నాడు. పెళ్లి వేదిక దగ్గరకు చేరుకోగానే.. కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. అనంత్ సోదరి ప్రత్యేకంగా ఆహ్వానం పలికింది. అనంతరం కుటుంబ సభ్యులు.. అనంత్‌ను వేదికపైకి తీసుకెళ్లి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ వేదికపై సోదరి కుటుంబం, అన్నయ్య, వదిన, పిల్లలతో అనంత్ ఫొటోలు దిగాడు.

ఇది కూడా చదవండి: Anant ambani wedding: అక్షయ్‌కుమార్‌కు కోవిడ్ పాజిటివ్.. పెళ్లికి హాజరుకాలేకపోతున్న హీరో

తల్లిదండ్రులు, ముఖేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు అంబానీ కుటుంబం ఉంది.. ఆకాష్ అంబానీ తన భార్య శ్లోకా మెహతా, ఇషా అంబానీ తన భర్త ఆనంద్ పిరమల్‌తో కలిసి వచ్చారు. ఉమ్మడిగా అందరూ ఫొటో దిగి అలరించారు. ఇక పెళ్లికుమార్తె రాధికా మర్చంట్ కూడా కళ్యాణ మండపానికి చేరుకోనుంది. ఇదిలా ఉంటే దేశ, విదేశాల నుంచి ప్రముఖులంతా పెళ్లికి హాజరయ్యారు.

Exit mobile version