Dum Masala Song Promo Released from Guntur Kaaaram Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరి నిరీక్షణ ఫలించింది. వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాలో ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయ్యి ‘దమ్ మసాలా’ ప్రోమోను విడుదల చేసింది. ఇక మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 7న సాంగ్ విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ పేర్కొంది. ఎదురొచ్చే గాలి, ఎగరేసున్న చొక్కాపై గుండీ, ఎగబడి ముందరికీ వెళ్ళిపోతాది నేనెక్కిన బండి, ఎర్రకారం-అరకోడి, మసాలా -ఫుల్ బీడీ అంటూ సాగుతున్న ఈ సాంగ్ ఆసక్తికరంగా సాగుతోంది. నిజానికి శుక్రవారం అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో ‘మసాలా బిర్యానీ’ అంటూ సాగే సాంగ్ బిట్ ఒకటి లీక్ అయ్యింది. అయితే ఇప్పుడు ఉన్న సాంగ్ అయితే కొంచెం భిన్నంగానే ఉంది.
Raghava Lawrence: అభిమానికి దిమ్మతిరిగే షాకిచ్చిన రాఘవ లారెన్స్
సంగీత దర్శకుడు తమన్ బాక్సులు బద్దలు అయిపోతాయని చెబుతున్నా ఆ రేంజ్ లో అయితే సాంగ్ కనిపించడం లేదు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో గుంటూరు కారం సినిమా తెరకెక్కుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చిన బాబు) ప్రొడ్యూస్ చేస్తున్న ‘గుంటూరు కారం’లో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న థియేటర్లలోకి సినిమా రానుండగా ఆ రోజు తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ‘హను – మాన్’, తర్వాత రోజు (జనవరి 13న) విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ‘సైంధవ్’, మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ‘ఈగల్’ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.