Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ తప్పించుకుని తిరగుతున్న అమృత్ పాల్ సింగ్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక కుట్ర ప్రకారం ఇండియాలో ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతడికి, ఇతని సన్నిహితులకు పాకిస్తాన్ గూఢాచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్లు, విదేశాల్లోని ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థల నుంచి ఆర్థిక సాయం అందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి.
గత నెల 18న అతడిని పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు భారీ ఎత్తున ఆపరేషన్ నిర్వహించారు. అయితే అప్పటి నుంచి అమృత్ పాల్ సింగ్ తప్పించుకుని తిరుగుతున్నాడు. అతడి సహాయకులును, మద్దతుదారులను పెద్దఎత్తున పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతమందిని అస్సాం దిబ్రూగఢ్ జైలుకు తరలించారు.
Read Also: Harbhajan Singh : అతడేం పాపం చేశాడు.. ఛాన్స్ ఎందుకు ఇస్తలేరు..
ఇదిలా ఉంటే అమృత్ పాల్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ బ్లూ స్టార్ కు కారణమైన, సిక్కు వేర్పాటువాది జర్నైల్ సింగ్ భింద్రెన్ వాలా కనిపించేందుకు అమృత్ పాల్ సింగ్ కాస్మెటిక్ సర్జరీ చేయించుకునేందు జార్జియా వెళ్లినట్లు తెలుస్తోంది. దిబ్రూగఢ్ లో ఉన్న అతని సన్నిహితులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. వారిస్ పంజాబ్ దే మాజీ లీడర్ దీప్ సిద్ధూ మరణించిన తర్వాత అమృత్ పాల్ సింగ్ ఈ సంస్థకు చీఫ్ గా పేస్ బుక్ ద్వారా ప్రకటించుకున్నాడు. భింద్రన్ వాలే 2.0గా ఫేమస్ అయ్యాడు.
దుబాయ్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న అమృత్ పాల్ సింగ్ హఠాత్తుగా ఇండియా వచ్చేసి తనను తాను సిక్కుల బోధకుడిగా ప్రకటించుకుని ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని పెంచిపోషించాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేసి తన మద్దతుదారులను విడిపించుకుని వెళ్లాడు. ఈ ఘటనలో ఎస్పీతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్ పాల్ అంతుచూడాలని భారీ ఆపరేషన్ నిర్వహించాయి.