Canada: ఖలిస్తానీ మద్దతుదారులు అరాచకాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కెనడా వంటి దేశాలు వీరి పట్ల ఉదాసీన వైఖరిని చూపుతుండటంతో అక్కడ ర్యాడికల్ ఖలిస్తానీలు రెచ్చిపోతున్నారు.
పంజాబ్‌లోని మోగాలో ఖలిస్తానీ వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అకల్ తఖ్త్ మాజీ చీఫ్, జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే మేనల్లుడు జస్బీర్ సింగ్ రోడే అమృతపాల్ అరెస్టుకు మార్గం సుగమం చేసినట్లు భావిస్తున్నారు. మోగాలోని రోదేవాల్ గురుద్వారాలో అమృతపాల్ సింగ్ లొంగిపోవాలని యోచిస్తున్నట్లు సమాచారం అందుకున్న జస్బీర్ సింగ్ రోడే రహస్యంగా పోలీసులకు సమాచారాన్ని పంచుకున్నాడు.
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ తప్పించుకుని తిరగుతున్న అమృత్ పాల్ సింగ్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక కుట్ర ప్రకారం ఇండియాలో ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతడికి, ఇతని సన్నిహితులకు పాకిస్తాన్ గూఢాచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధం ఉన్నట్లు, విదేశాల్లోని ఖలిస్తానీ వేర్పాటువాద సంస్థల నుంచి ఆర్థిక సాయం అందినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చాయి.