Amit Shah: మావోయిస్టుల వల్ల 6 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వామపక్ష తీవ్రవాద సమీక్షలో అమిత్ షా కీలక వాఖ్యలు చేశారు. అభివృద్ధిని చేరువ చేయాలంటే వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేయాలన్నారు. వామపక్ష తీవ్రవాదం అంతిమ దశలో ఉందన్నారు. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేస్తే దశాబ్దాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపిన వాళ్ళం అవుతామన్నారు. జవాన్ల కోసం 12 హెలికాఫ్టర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదంతో అనుసంధానమై ఉన్న యువత ఆయుధాలు వదిలి ప్రజల్లోకి రావాలన్నారు. దేశ అభివృద్ధి లో భాగస్వాములు కావాలని తెలిపారు. నక్సలిజం వల్ల ఉపయోగం లేదన్నారు. ఏపీ ,తెలంగాణ, మహారాష్ట్ర వామపక్ష ఉగ్రవాద నిర్ములనకు మంచి నిర్ణయాలు చర్యలు తీసుకున్నాయని తెలిపారు. 2014-24 వరకు వామపక్ష తీవ్రవాద ప్రబావిత ప్రాంతాల్లో 3006 కోట్లు ఖర్చు చేసామన్నారు. 11500 కిమి రోడ్ నెట్ ఏర్పాటు చేసామని తెలిపారు.
Read also: Thummala Nageswara Rao: రూ. 2 లక్షల పైబడి రుణం.. మంత్రి తుమ్మల గుడ్ న్యూస్
15300 మోబైల్ టవర్స్ ఏర్పాటు చేసామని వెల్లడించారు. ఏకలవ్య స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 120 పోలిస్టెషన్ల పరిధిలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో నక్సల్ ప్రభావిత జిల్లాలు తగ్గుతాయని భావిస్తున్నామన్నారు. చత్తీస్ ఘడ్ లో హత్యాకాండ మాత్రేమే కాదు స్వయంగా లోగిపోతున్నవారు పెరిగారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై నెలకోసారి రివ్యూ జరపాలని సూచించారు. నక్సలిజం ప్రజలకు మానవాళికి వ్యతిరేకమన్నారు. నక్సలిజం వల్ల ఆదివాసీలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. 6 కోట్ల మంది ప్రజలు మావోయిస్టుల వల్ల ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నెలకోసారి,డిజిపి 15 రోజులకోసరి నక్సల్ నిర్మూలన పై రివ్యూ జరపాలన్నారు. డీజీపీలు మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో పర్యటించాలని ఆదేశించారు. 2026 నాటికి కేంద్రం రాష్ట్రాలు కలిసి నక్సలిజాన్ని నిర్ములించాలన్నారు.
BRS MLAs: టీడీపీలో చేరుతాం.. క్లారిటీ ఇచ్చిన తీగల కృష్ణా రెడ్డి..