NTV Telugu Site icon

Housing Crisis: భారత విద్యార్థులకు కెనడా షాక్..? హౌసింగ్ సంక్షోభం నేపథ్యంలో పరిమితి..

Housing Crisis

Housing Crisis

Housing Crisis: కెనడాలో హౌసింగ్ క్రైసిస్ తీవ్రమవుతోంది. అక్కడ ప్రజలు ఇళ్లు దొరక్క తెగ ఇబ్బందుల పడుతున్నారు. కెనడాలో పెరుగుతున్న నిరుద్యోగం, గృహ సంక్షోభంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలపై అక్కడి ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ మాట్లాడుతూ.. విదేశీ విద్యార్థులపై పరిమితి విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు శనివారం వెల్లడించారు. అయితే ఎంతమేర పరిమితి విధిస్తారనే వివరాలను మంత్రి పేర్కొనలేదు.

Read Also: Suicide: తండ్రి ఫోన్‌ వాడొద్దన్నందుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కూతురు..

సీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫెడరల్ ప్రభుత్వం, ప్రాంతీయ ప్రభుత్వాలతో చర్చించాల్సి ఉందని ఆయన అన్నారు. కెనడాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను కలవరపరిచేలా ఉందని అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో మొదటి మరియు రెండవ త్రైమాసికాల్లో గృహాల డిమాండ్‌ను తగ్గించడంలో సహాయపడటానికి అంతర్జాతీయ విద్యార్థులపై పరిమితిని నిర్ణయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు మిల్లర్ చెప్పారు. అయితే ఇదే హౌసింగ్ సంక్షోభానికి ఏకైక పరిష్కారం కాదని అన్నారు.

కెనడాకు చదువుకునేందుకు వెళ్తున్న విద్యార్థుల్లో ఇండియా నుంచి వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంది. అయితే గృహ సంక్షోభం నేపథ్యంలో కెనడా విదేశీ విద్యార్థులపై పరిమితి విధిస్తే ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఈ ఏడాది 4,85,000 మంది వలసదారుల్ని, 2025, 2026లో 5,00,000 మంది వలసదారుల్ని కెనడాకు ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకుంది.