Housing Crisis: కెనడాలో హౌసింగ్ క్రైసిస్ తీవ్రమవుతోంది. అక్కడ ప్రజలు ఇళ్లు దొరక్క తెగ ఇబ్బందుల పడుతున్నారు. కెనడాలో పెరుగుతున్న నిరుద్యోగం, గృహ సంక్షోభంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలపై అక్కడి ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ మాట్లాడుతూ.. విదేశీ విద్యార్థులపై పరిమితి విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు శనివారం వెల్లడించారు. అయితే ఎంతమేర పరిమితి విధిస్తారనే వివరాలను మంత్రి పేర్కొనలేదు.
Canada: కెనడాను సంక్షోభం భయపెడుతుంది. అంతా అనుకున్నట్లు ఇది భారత్-కెనడాల మధ్య దౌత్యవివాదం మాత్రం కాదు. ఇప్పుడు ఆ దేశాన్ని ‘గృహ సంక్షోభం’ భయపెడుతోంది. జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై పలువురు ఎంపీలు విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రూడో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న న్యూ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ కూడా