Site icon NTV Telugu

China Vs India: అమెరికా దెబ్బకి.. భారత్తో దోస్తీకి చైనా ప్లాన్

China

China

China Vs India: భారత్ కు పొరుగు దేశమైన చైనాకు మనకు ఎప్పుడు వివాదం కొనసాగుతునే ఉంటుంది. మన దేశంలోని భూ భాగాన్ని ఎప్పుడు ఆక్రమించుకోవడానికి, అదును చూసి దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుంది డ్రాగన్ కంట్రీ. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇండియాతో వ్యూహాత్మక సంబంధాలను పెంచుకోవడానికి తాము రెడీగా ఉన్నామని చైనా అధినేత జిన్ పింగ్ ప్రకటించారు. దీనికి ఓ కారణం ఉంది.. ఏమిటంటే, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనా డొనాల్డ్ ట్రంప్ చైనాపై భారీగా టారిఫ్ లు విధించాడు. ఏకంగా 125 శాతం సుంకాలు విధించడంతో ఒక్కసారిగా చైనా డైలామాలో పడింది.

Read Also: Vaani Kapoor : వరుస ప్లాపులతో వెనకబడిన వాణి

ఇక, బీజింగ్‌లో మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు జరిగిన ఉన్నతస్థాయి కేంద్ర కమిటీ సమావేశంలో జిన్‌పింగ్‌ మాట్లాడుతూ..
తమ మధ్య అభిప్రాయ భేదాలను తగ్గించుకుని సరఫరా వ్యవస్థలను మరింత పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తామన్నారు. అలాగే, పొరుగు దేశాలు ముఖ్యంగా భారత్ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.. ఇరు దేశాల మధ్య ఒక మంచి ఉమ్మడి సమాజాన్ని నిర్మిస్తామన్నారు. షీ జిన్‌పింగ్‌ త్వరలో పొరుగు దేశాలైన వియత్నాం, మలేసియా, కాంబోడియాలలో పర్యటించే అవకాశం ఉంది. కాగా, జిన్ పింగ్ వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.

Exit mobile version