ఓ ప్రేమజంటకు అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది. తల్లిదండ్రుల్ని ఎదురించి వివాహం చేసుకున్న జంటకు రక్షణ కల్పించలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. పోలీస్ రక్షణను హక్కుగా డిమాండ్ చేయరాదని.. ఒకవేళ నిజమైన బెదిరింపు అయితే పోలీసులు రక్షణ కల్పిస్తారని అలహాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఇది కూడా చదవండి: Gold Rates: తగ్గేదేలే అంటున్న పసిడి.. నేడు మరో వెయ్యి జంప్
ప్రేమ వివాహం చేసుకున్న శ్రేయా కేసర్వాణి, ఆమె భర్త… రక్షణ కల్పించాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన ధర్మాసనం.. నిజంగా బెదిరింపు వస్తే పోలీసులు రక్షణ కల్పిస్తారని.. కానీ అలాంటి బెదిరింపులు లేకుండానే రక్షణ కల్పించాలని కోరడం భావ్యంకాదని పిటిషన్ కొట్టేసింది.
ఇది కూడా చదవండి: NBK 111: బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాకు ముహూర్తం ఫిక్స్