Prajwal Revanna Arrest: “మహిళా పోలీస్” టీమ్‌తో ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్.. సిట్ సానుకూల సందేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prajwal Revanna Arrest: కర్ణాటకలో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన జేడీఎస్ మాజీ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల కుంభకోణంలో కీలక పరిణామం ఎదురైంది. ఈ కేసు బయటకు రాగానే ఇండియా నుంచి జర్మనీ వెళ్లిన ప్రజ్వల్ రేవణ్ణ, ఈ రోజు తెల్లవారుజామున బెంగళూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అర్ధరాత్రి తర్వాత బెంగళూర్ వచ్చిన ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అక్కడే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్పటికే ప్రజ్వల్ ముందస్తు బెయిల్‌ని బెంగళూర్ కోర్టు తిరస్కరించగా, తాజాగా కర్ణాటక హైకోర్టు కూడా ఇదే నిర్ణయం తీసుకుంది.
Read Also: Hari Hara Veera Mallu : హరిహర వీరమల్లు షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడంటే..?
Also Read
- INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
- మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
ప్రజ్వల్‌ని మహిళా పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేసిన టీంలో అంతా మహిళా అధికారులే ఉన్నారు. అరెస్ట్ వివరాలను రాజకీయ నాయకుడిగా మారిన మాజీ పోలీస్ అధికారి భాస్కర్ రావు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘‘ పరారీలో ఉన్న ఎంపీని బెంగుళూరు విమానాశ్రయం నుంచి మహిళా పోలీస్ టీం అరెస్ట్ చేసి తీసుకెళ్లింది. ఈ చర్య వందలాది మందికి బలమైన సంకేతాన్ని పంపుతుందని, సిట్ నిర్ణయం బలమైన సానుకూల సందేశం.’’ అని పోస్ట్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరులోని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) కార్యాలయానికి తీసుకెళ్లారు, అక్కడ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అతన్ని ప్రశ్నించనుంది.
ఏప్రిల్ 27 తర్వాత ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవిగా చెప్పబడుతున్న అనేక సెక్స్ వీడియోలు హసన్ జిల్లాతో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో వైరల్ అయ్యాయి. రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజ్వల్ ఇండియా నుంచి జర్మనీ వెళ్లిపోయారు. ఈ ఘటనను విచారించేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.
The fugitive MP was escorted out of the Bengaluru Airport by a all women police team , a decision of SIT was a strong positive sign that strong women police force of Karnataka will not only deal with the perpetrator but send a strong message to the hundreds of women whose modesty…
— Bhaskar Rao (@Nimmabhaskar22) May 31, 2024
తాజావార్తలు
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..