Alcohol Abusers in india: దేశవ్యాప్తంగా ఆల్కహాల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మేరకు దేశంలో ఎంతమంది మద్యం తాగుతున్నారు అన్న విషయంపై సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన నషా ముక్తి అభియాన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది మద్యం తాగుతున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. అంతేకాకుండా 3 కోట్ల మంది గంజాయి, 9.4 లక్షల మంది కొకైన్, 15.47 లక్షల మంది ఏటీఎస్ వాడుతున్నట్లు సర్వేలో బట్టబయలు అయ్యింది. అయితే దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లోని వారు అత్యధికంగా వీటిని వినియోగిస్తున్నారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలు కూడా ఉండటం గమనార్హం.
Read Also: Most Powerful Passports 2022: పవర్ ఫుల్ పాస్‌పోర్టుల్లో జపాన్ తొలిస్థానం.. ఇండియా స్థానం ఎంతంటే..
మద్యం తాగేవారిలో 15 కోట్ల మంది 18-75 వయసు వాళ్లు ఉన్నారు. 30 లక్షల మంది 10 నుంచి 17 ఏళ్ల లోపు వయసున్న వాళ్లు ఉన్నట్లు సర్వే వెల్లడించింది. కాగా పెద్దవాళ్లతో పోలిస్తే యువతలోనే మద్యపానం వల్ల అనర్ధాలు ఎక్కువగా ఉంటున్నాయని ఇటీవల లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 15-39 ఏళ్ల వయసు వారికి ఆల్కహాల్ అనేది ఎంతో హానికరంగా మారుతోందని అభిప్రాయపడింది. అందుకే యువత డ్రింక్ చేయరాదని.. పెద్ద వయస్కులు మాత్రం స్వల్ప మోతాదులో ఆల్కహాల్ తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అటు ప్రపంచవ్యాప్తంగా మద్యపానం సేవిస్తున్న వారిలో ఎక్కవగా 15-39 ఏళ్ల వారే ఉంటున్నారని లాన్సెట్ జర్నల్ తన అధ్యయనంలో వివరించింది.
15 crore Indians are alcohol abusers , 3 crore Ganja , 9.4 lakh cocaine users. Nasha Mukti Bharat Abhiyan of Ministry of Social Justice has identified 272 most vulnerable districts including in Telangana and Andhra. #NashaMukthBharat #DrugAbuse #Alcocholabuse pic.twitter.com/LJvCV3z7Co
— Sudhakar Udumula (@sudhakarudumula) July 19, 2022