Ajit Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఈరోజు (బుధవారం) ఉదయం విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆయన ముంబై నుంచి బారామతికి లియర్‌జెట్ 45 విమానంలో వెళ్లారు. అయితే, ల్యాండింగ్‌కు కొన్ని క్షణాల ముందు రన్ వేకు పక్కనే విమానం క్రాష్ ల్యాండ్ అయింది. వెంటనే పెద్ద మంటలు చెలరేగి అందులో ఉన్న ఐదుగురు మరణించారు.
అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన కొత్త వీడియో వెలుగులోకి వచ్చింది. విమానం వేగంగా కిందికి దిగుతున్నట్లు కనిపించింది. అదే సమయంలో ఎడమ వైపు వంగినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ల్యాండింగ్ కు ముందు ఇలా జరగడం అసాధారణమని ఎవియేషన్ ఎక్స్‌ఫర్ట్ చెబుతున్నారు. ఇది సాంకేతిక లోపం లేదా పైలట్లు విమానంలో ఏర్పడిన ఒత్తిళ్లను భర్తీ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. బారామతిలోని గోజుబావి గ్రామ పంచాయతీలోని సీసీటీవీ కెమెరాల్లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి.
