NTV Telugu Site icon

Ajit Pawar: మహరాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్.. మంత్రులుగా 9 మంది ఎన్సీపీ నేతలు

Ajit Pawar

Ajit Pawar

Ajit Pawar:మహరాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కీలక నేత అజిత్ పవార్ అసమ్మతి రగిలించారు. తాజాగా ఆయన బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరారు. అజిత్ పవార్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కు బిగ్ షాక్ ఇచ్చారు. గత కొంత కాలంగా ఆయన బీజేపీలో చేరుతారనే వార్తల నేపథ్యంలో ఈ రాజకీయ పరిణామం ఎదురైంది. తాజాగా అజిత్ పవార్ మరియు 9 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

Read Also: NCP Ajit Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు.. ఎన్సీపీ కాంగ్రెస్‎లో చీలిక

అజిత్ పవార్, పలువురు ఎమ్మెల్యేల మద్దతుతో ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరారు. ఆయన ఈ పోస్ట్‌ను బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో పంచుకోనున్నారు. మొత్తం 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో 30 మంది అజిత్ పవార్ వర్గంలో చేరిపోయారు. ఆదివారం రాజ్ భవన్ లో ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో గవర్నర్ అజిత్‌ పవార్‌తో పాటు ఛగన్‌ భుజ్‌బల్‌, ధనంజయ్‌ ముండే, దిలీప్‌ వాల్సే పాటిల్‌ సహా మొత్తం తొమ్మిది మంది ఎన్‌సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయించారు.

అంతకుముందు ముంబైలోని తన అధికారిక నివాసంలో అజిత్ పవార్ కొందరు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ భేటీ గురించి ఎన్సీపీ చీప్ శరద్ పవార్ కి తెలియదు. ‘‘ఈ సమావేశాన్ని ఎందుకు పిలిచారో నాకు సరిగ్గా తెలియదు కానీ, ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్యేల సమావేశాన్ని పిలిచే హక్కు ఆయనకు [అజిత్ పవార్‌కు] ఉంది. అతను క్రమం తప్పకుండా అలా చేస్తాడు. దీని గురించి నాకు పెద్దగా వివరాలు లేవు. సమావేశమయ్యారు’’ అని శరద్ పవార్ అన్నారు. అజిత్ పవార్ అధికారిక నివాసం ‘దేవగిరి’లో జరిగిన ఈ సమావేశానికి ఎన్‌సిపి సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే తదితరులు హాజరు కాగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జయంత్ పాటిల్ హాజరుకాలేదు.