NTV Telugu Site icon

Bangladesh Crisis: ఇవాళ బంగ్లాదేశ్‌కు ఎయిరిండియా ప్రత్యేక విమానం

Air India

Air India

Bangladesh Crisis: ఆందోళనలు కొనసాగుతున్న బంగ్లాదేశ్‌కు ఎయిరిండియా ఇవాళ (బుధవారం) విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది. ముందే షెడ్యూల్‌ చేసిన సర్వీసులను యథావిధిగా నిర్వహిస్తామని తెలిపింది. విస్తారా, ఇండిగో సైతం అదే బాటలో వెళ్తున్నాయి. ఆ దేశ రాజధాని ఢాకాకు విమానాలు వెళ్తాయని పేర్కొనింది. మరోవైపు బంగ్లాలో ఉన్న భారతీయులను భారత్‌కు చేర్చేందుకు ఎయిరిండియా నేడు ఒక ప్రత్యేక విమానాన్ని సైతం ఢాకాకు పంపబోతున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పుకొచ్చాయి.

Read Also: Mega Year: 2024ను మెగా సంవత్సరంగా పిలుస్తున్న ఫ్యాన్స్. కారణం ఏంటంటే..?

అయితే, ఎయిరిండియా నిన్న (మంగళవారం) సాయంత్రం ఢాకాకు ఓ విమానాన్ని పంపింది. ఉదయం మాత్రం క్యాన్సిల్ చేసింది. ఈ సంస్థ రోజుకు రెండు విమానాలను ఢాకాకు నడిపిస్తుంది. విస్తారా ప్రతి రోజు ముంబయి నుంచి ఢాకాకు రెండు, ఢిల్లీ నుంచి ఢాకాకు వారానికి మూడు సర్వీసులను కొనసాగిస్తుంది. ఇండిగో ఢిల్లీ, ముంబయి, చెన్నై నుంచి ఢాకాకు రోజుకొక విమాన సర్వీసును నడిపిస్తున్నట్లు ప్రకటించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో విస్తారా, ఇండిగో సైతం మంగళవారం తమ రోజువారీ విమానాలను మాత్రం క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముందే టికెట్ బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు ఆయా సంస్థలు తగిన ఆఫర్లను అందిస్తుంది.

Read Also: Mega Year: 2024ను మెగా సంవత్సరంగా పిలుస్తున్న ఫ్యాన్స్. కారణం ఏంటంటే..?

కాగా, బంగ్లాదేశ్‌లో 19 వేల మంది భారతీయులు ఉన్నారని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ ప్రకటించారు. వారిలో 9 వేల మంది విద్యార్థులేనని పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో విద్యార్థులు జులైలోనే భారత్‌కు తిరిగి వచ్చేశారని.. దౌత్యవేత్తల ద్వారా అక్కడున్న భారతీయులతో మాట్లాడుతున్నాం.. మైనారిటీల పరిస్థితులను నరేంద్ర మోడీ ప్రభుత్వం గమనిస్తుందని జై శంకర్ వెల్లడించారు.