Zomato CEO: జొమాటో సీఈవో సీక్రెట్‌గా రెండో పెళ్లి.. అమ్మాయెవరంటే…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ మరోసారి ఏడడుగులు వేశాడు. రహస్యంగా మెక్సికో మోడల్ మునోజ్ గ్రెసియాను వివాహం చేసుకున్నాడు. మునోజ్ గ్రెసియా.. లగ్జరీ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ స్పేస్‌లో స్వంత స్టార్టప్‌ను నడుపుతోంది. మెక్సికోలో పుట్టి పెరిగిన ఆమె.. దీపిందర్ గోయల్‌ని పెళ్లి చేసుకోవడంతో భారత్‌లో మెట్టింట్లో అడుగుపెట్టినట్లు తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో వెల్లడించింది.
2022 సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్‌లో జరిగిన మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్ పోటీల్లో మునోజ్ విజేతగా నిలిచింది. జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌ను కొన్ని నెలల క్రితం మునోజ్ వివాహం చేసుకున్నారు. దీపిందర్ గోయల్‌కి ఇది రెండో వివాహం. గోయల్ గతంలో ఐఐటీ ఢిల్లీలో చదువుతున్నప్పుడు పరిచయమైన కంచన్ జోషిని వివాహం చేసుకున్నాడు. గత కొంత కాలంగా భార్యతో విడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు విడిపోయినట్లుగానే ఉన్నట్లు సమాచారం. కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.
Also Read
- Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు

ప్రస్తుతం గ్రెసియా.. తన భర్తతో ఇండియాలో ఉన్నట్లు తెలిపింది. అలాగే ఫిబ్రవరిలో తమ హనీమూన్ కూడా ముగిసిందని పేర్కొంది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకుంది. తన భర్తతో కలిసి ఢిల్లీలో నివాసం ఉంటుంది. ఈమె ఓ టెలివిజన్‌లో హోస్టింగ్ కూడా పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం తన కొత్త ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపింది.
ఇక ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమోటో 2008లో స్థాపించబడింది. అప్పటి నుంచి మంచి లాభాలతో దూసుకెళ్తోంది. ప్రముఖ స్టార్టప్‌ల్లో జొమాటో ఒకటిగా నిలిచింది. దేశ వ్యాప్తంగా వినియోగదారులకు విస్తృతంగా సేవలందిస్తోంది. పలు మార్లు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. అయినా కూడా వినియోగదారులకు అనుగుణంగా అభివృద్ధిలో దూసుకెళ్తూనే ఉంది.
ఇది కూడా చదవండి: CSK vs RCB: చెన్నై వర్సెస్ ఆర్సీబీ.. ప్రారంభ మ్యాచ్‌లో ప్లేయింగ్-11?
తాజావార్తలు
-
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
-
Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్‌తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..