Air India Crash: ఎయిర్ ఇండియా క్రాష్.. ఇండియాలోనే భారీ “ఇన్సూరెన్స్ క్లెయిమ్” కావచ్చు..
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం..
- భారీగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Crash: ఎయిరిండియా ప్రమాదం ఎవియేషన్ ఇండస్ట్రీలోనే అత్యంత దారుణమైన సంఘటనల్లో చేరింది. గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్‌కి వెళ్తున్న విమానం, టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒక్కరు మినహా 242 మందిలో అందరూ చనిపోయారు. మెడికల్ హాస్టల్ భనవంపై కూలడంతో 24 మంది మెడికోలు చనిపోయారు. మొత్తంగా 265 మంది చనిపోయారు.
అయితే, ఇప్పుడు ప్రమాదంపై ఇన్సూరెన్స్‌పై చర్చ జరుగుతోంది. భారతదేశ బీమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావచ్చని పలువురు చెబుతున్నారు. ఈ ప్రమాదం వల్ల కలిగిన నష్టం 211 మిలియన్ డాలర్ల నుంచి 280 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. అంటే రూ. 2400 కోట్లు.
Also Read
- PF Withdrawal Via UPI-ATM: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం..
- Mamata Banerjeeకి హైకోర్టులో ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్.!
- NEET Re Exam: నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు విషాదం.. 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య..
- MRP Violation Case: MRP కంటే రూ.20 ఎక్కువ వసూలు.. దుకాణదారుడు, కంపెనీకి కోర్టు రూ.10 లక్షల జరిమానా
Read Also: Honeymoon Murder: రాజా లాగే మరో మహిళను హత్య చేయాలని ప్లాన్.. సోనమ్ కేసులో సంచలన విషయం..
ప్రభుత్వ రంగ రీఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (GIC) ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రామస్వామి నారాయణన్ ప్రకారం, విమాన సంస్థ ఫ్లీట్ ఇన్సూరెన్స్ పాలసీ సాధారణంగా విమాన భాగాలు, విడిభాగాలు, ప్రయాణికులకు, థర్డ్ పార్టీకి జరిగిన నష్టాలను కవర్ చేస్తుంది. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది మరణించారు. ఈ ప్రమాదంలో విమానానికి, జరిగిన నష్టాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయవచ్చు. ఈ క్లెయిమ్ ఏజ్, కాన్ఫిగరేషన్, ఇతర విషయాలపై ఆధారపడి ఉంటుంది.
ప్రయాణీకులకు పరిహారం 1999 మాంట్రియల్ కన్వెన్షన్ కిందకు వస్తుంది, దీనికి భారతదేశం 2009లో సంతకం చేసింది. ఈ పరిహారం స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRలు) కింద లెక్కించబడుతుంది, ప్రస్తుత విలువ 1,28,821 SDRలు లేదా దాదాపు $1,71,000, అంటే రూ.1.47 కోట్లు. దీనికి తోడు, ప్రమాదం వల్ల మూడో పక్షానికి నష్టం బాధ్యత, క్రాష్ సైట్‌లో ప్రాణనష్టాన్ని కూడా లెక్కిస్తారు. ఇప్పటికే విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతీ కుటుంబానికి టాటా గ్రూప్ రూ.1 కోటి పరిహారాన్ని ప్రకటించింది.
తాజావార్తలు
-
PF Withdrawal Via UPI-ATM: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం..
-
Anandita Surgery Rumours : అలాంటి సర్జరీలు చేయించుకోలేదు… ట్రోలర్స్ పై మండిపడ్డ ఖుష్బూ కూతురు
-
Gill-Gambhir: టీమిండియాకు తలనొప్పులు తప్పవు.. గిల్, గంభీర్ నిర్ణయంపై విమర్శలు!
-
US War Cost in Iran: 108 రోజుల భీకర యుద్ధం.. అమెరికా ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో తెలుసా?
-
Porsche 911 GT3: భారత్ లో పోర్షే 911 GT3 విడుదల.. 311 km/h, 503 bhp పవర్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!