Air Force Helicopter: సాంకేతిక లోపంతో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ చెన్నై సమీపంలో అత్యవసర ల్యాండింగ్
- చెన్నై సమీపంలో సాంకేతిక లోపంతో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..
- ఈరోజు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు వెల్లడించిన స్థానిక పోలీసులు..
- హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్యపై అత్యవసర విచారణకు ఆదేశించిన రక్షణ శాఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Force Helicopter: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలోని పోర్పంధాల్ గ్రామంలో సోమవారం ఉదయం తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి వెళ్తున్న శిక్షణ హెలికాప్టర్( IAF) అత్యవసరంగా ల్యాండ్ అయింది. అయితే, అది చూసిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక, సంఘటన ప్రదేశానికి వచ్చిన పోలీసులు.. ఈరోజు ఉదయం 10.30 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యల ఏర్పాడినట్లు పైలట్లు కెప్టెన్ సంజీవ్, నీరజ్ లను అడిగి తెలుసుకున్నారు. అయితే, పోర్పంధాల్ సరస్సు వ్యవసాయ భూమికి ఆనుకుని ఉందని.. అదృష్టవశాత్తూ పైలట్లు నీటిలో పడిపోకుండా వరి పొలంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.
Read Also: Sourav Ganguly: సుప్రీంకోర్టు త్వరగా తీర్పు ఇవ్వాలని దాదా విజ్ఞప్తి..
Also Read
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
ఇక, సాంకేతిక సమస్యతో హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని తాంబరం ఎయిర్‌ఫోర్స్‌కు ఫైలెట్లు సమాచారం అందించారు. కొద్ది సేపటికే ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కూడిన మరో హెలికాప్టర్ ఘటనాస్థలికి చేరుకుంది. శిక్షణ ఛాపర్‌కు మరమ్మతులు చేసిన తర్వాత రెండు చాపర్లు మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. కాగా, ఈ ఘటనపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. దీనికి సంబంధించి మాకు ఎలాంటి సమాచారం అందలేదని రక్షణ శాఖ అధికారి ఒకరు చెప్పుకొచ్చారు. హెలికాఫ్టర్ ల్యాండింగ్ అయినట్లు సమాచారం తెలుసుకున్న పలువురు గ్రామస్తులు ఆ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ తో సెల్ఫీలు దిగేందుకు అక్కడికి చేరుకున్నారు.
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?