Site icon NTV Telugu

PM Modi: ప్రధాని మోడీతో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ భేటీ..

Modi

Modi

PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ సమావేశం అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ మీటింగ్ జరిగింది. ఈ క్రమంలో వీరి భేటీకి ప్రాధాన్యం నెలకొంది. అలాగే, నిన్న నేవీ చీఫ్ మార్షల్ తోనూ ప్రధాని సమావేశం అయ్యారు. భారత్- పాక్ సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో త్రివిధ దళాలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ప్రధాని మోడీ.

Read Also: Chiranjeevi : ‘విశ్వంభర’ నుంచి త్రిష లుక్ రివిల్.. !

ఇక, ప్రధాని మోడీ త్రివిధ దళాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటంతో మళ్లీ ఉత్కంఠ పరిస్థితులు పెరుగుతున్నాయి. రక్షణ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సూచించారు. అలాగే, తాను ఇప్పటికే రష్యా పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రధాని మోడీ కూడా తెలిపారు. ఎలాంటి పరిస్థితులను అయినా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం.

Exit mobile version