Site icon NTV Telugu

Jharkhand: కూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి

Jharkhand

Jharkhand

జార్ఖండ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ అంబులెన్స్ కూలిపోయింది. అందులో ఉన్న ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

సోమవారం రాత్రి 7.11 గంటలకు రాంచీ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్తున్న రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ ప్రైవేట్ లిమిటెడ్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే చత్ర జిల్లాలోని సిమారియా సమీపంలో కూలిపోయింది. అయితే ప్రమాదంలో విమానంలో ఉన్న ఏడుగురు చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు.

రాత్రి 7:30 గంటల ప్రాంతంలో విమానం అదృశ్యమైందని చత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తిశ్రీ వెల్లడించారు. సిమారియాలోని బరియాటు పంచాయతీ ప్రాంతంలో ఇది కూలిపోయిందని ఆమె తెలిపారు. విమానంలో ఉన్న ఏడుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు SDPO శుభం ఖండేల్వాల్ పేర్కొన్నారు. కెప్టెన్ వివేక్ వికాస్ భగత్, కెప్టెన్ సావ్రాజ్‌దీప్ సింగ్, సంజయ్ కుమార్, డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చన దేవి, ధురు కుమార్‌గా గుర్తించారు.

Exit mobile version