BJP: బీజేపీ టార్గెట్ 400.. ప్రతిపక్ష ఎంపీలను చేర్చుకునేందుకు ప్యానెల్ ఏర్పాటు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: బీజేపీ టార్గెట్ 400.. ప్రతిపక్ష ఎంపీలను చేర్చుకునేందుకు ప్యానెల్ ఏర్పాటు.. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తుంటే.. ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రధాని మోడీని అధికారంలోకి దించాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సారి బీజేపీ 543 లోక్‌సభ స్థానాల్లో ఏకంగా 400 ఎంపీ స్థానాలను గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. దానిని సాధించేందుకు ఇతర పార్టీల ఎంపీలను బీజేపీలోకి ఆహ్వానించేందుకు పార్టీ వ్యూహాలను రూపొందిస్తున్నట్లు సమాచారం.
మంగళవారం జరిగిన బీజేపీ ముఖ్య సమావేశంలో, పార్టీ చీఫ్ జేపీ నడ్డా పార్టీ కార్యదర్శులకు వేర్వేరు బాధ్యతల్ని అప్పగించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేకి ‘జాయినింగ్ కమిటీ’ బాధ్యతలను అప్పగించారు. ఈ పార్టీ ఇతర పార్టీల్లో ఉండే ప్రతిభావంతులైన నాయకులను, ఇతర సిట్టింగ్ ఎంపీలను బీజేపీలోకి తీసుకురావాలని చూస్తోంది. నియోజకవర్గంలో సదరు నేత ప్రభావం, ఎన్నికల్లో గెలిచే సామర్థ్యం ఆధారంగా కమిటీ నిర్ణయం తీసుకోనుంది. గత ఎన్నికల్లో కోల్పోయిన 160 సీట్లపై బీజేపీ దృష్టి పెట్టిన నేపథ్యంలో తాజా నిర్ణయం ముడిపడి ఉంది.
Also Read
- Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్‌లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
- Milk Price Hike: పండుగ సీజన్‌కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
- Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్‌లో కొత్త సంక్షోభం..!
- CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
Read Also: Karnataka: కర్ణాటక అసెంబ్లీ ముందు 8 మంది కుటుంబ సభ్యుల ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే..?
1984లో చివరిసారిగా రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ 400కి మించి ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే గత రెండు పర్యాయాలుగా బీజేపీ సొంతబలంలో, మ్యాజిక్ ఫిగర్ దాటి ఎంపీ స్థానాలను సాధించినప్పటికీ.. 400ల మార్క్‌కి దూరంగానే ఉంది.
ఇదిలా ఉంటే 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించే బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి రాధామోహన్ దాస్ అగర్వాల్‌కు అప్పగించారు. ఎన్నికల ప్రచారం, ప్రచారం మరియు ఇతర సంబంధిత పనులను సునీల్ బన్సాల్, ఇతర కార్యదర్శులు చూసుకుంటారు. ఈ సమావేశంలో బీజేపీ చీఫ్ నడ్డా పార్టీ ప్రధాన కార్యదర్శులు, కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవ్యలతో సమావేశమయ్యారు. అస్సాం సీఎం హిమంత బిశ్వసర్మ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్‌దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!