BJP: బీజేపీ టార్గెట్ 400.. ప్రతిపక్ష ఎంపీలను చేర్చుకునేందుకు ప్యానెల్ ఏర్పాటు.. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తుంటే.. ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రధాని మోడీని అధికారంలోకి దించాలని భావిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సారి బీజేపీ 543 లోక్‌సభ స్థానాల్లో ఏకంగా 400 ఎంపీ స్థానాలను గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. దానిని సాధించేందుకు ఇతర పార్టీల ఎంపీలను బీజేపీలోకి ఆహ్వానించేందుకు పార్టీ వ్యూహాలను రూపొందిస్తున్నట్లు సమాచారం.