PM Modi: పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), సీఎం మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. బీహార్‌లో ‘‘జంగిల్ రాజ్’’ను బీజేపీ, ఎన్డీయే అంతం చేశాయని, బెంగాల్ కూడా టీఎంసీ ‘‘మహా జంగిల్ రాజ్’’ను అంతం చేయాలని ప్రధాని ఆదివారం అన్నారు. సింగూర్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు. బెంగాల్‌లో పాలనను మార్చాలని అసవరం ఉందని ఆయన అన్నారు.
Read Also: Greenland: డెన్మార్క్ చిన్నదేశం, గ్రీన్‌లాండ్‌ను కంట్రోల్ చేయలేదు.. ట్రంప్ సహాయకుడి కామెంట్స్..
బెంగాలీ భాష, సాహిత్యం చాలా గొప్పదని, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి తర్వాతే బెంగాలీ భాషకు శాస్త్రీయ హోదా లభించిందని, దుర్గాపూజకు యునెస్కో సాంస్కృతిక వారసత్వ హోదా లభించిందని గుర్తు చేశారు. టీఎంసీ, ఢిల్లీలో సోనియాగాంధీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పుడు ఈ పనులు ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. ఇండియా గేట్ ముందు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రతిష్టించింది బీజేపీ ప్రభుత్వమే అని, అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక ద్వీపానికి నేతాజీ పేరు పెట్టామని అన్నారు.
బెంగాల్‌లో శాంతిభద్రతలు మెరుగైనప్పుడే పరిశ్రమలు వస్తాయని అన్నారు. కానీ బెంగాల్‌లో అల్లరిమూకలు, దోపిడీదారులు, మాఫియాకు ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చిందని ఆరోపించారు. ఇక్కడ ప్రతీదానికి ఒక సిండికేట్ పన్ను విధించబడుతోందని, కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఈ సిండికేట్ పన్నును, ఈ మాఫియా పాలనను అంతం చేస్తుందని మోడీ అన్నారు.
