New Delhi: 25 ఏళ్ల తర్వాత మళ్లీ అదే థియేటర్‌లో అగ్నిప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని గ్రీన్ పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉండే ఉపహార్ థియేటర్‌లో ఆదివారం తెల్లవారుజామున మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఐదు ఫైరింజన్‌లతో మంటలు ఆర్పివేశారు. థియేటర్‌లో మూలకు పడి ఉన్న ఫర్నీచర్ కు నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. థియేటర్‌లోని బాల్కనీ, ఫ్లోర్ బాగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.
అయితే 25 ఏళ్ల కిందట ఇదే థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 1997 జూన్ 13న మధ్యాహ్నం 3 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. అప్పటి ఘటనలో 59 మంది చనిపోయారు. ఈ ప్రమాదం వల్ల జరిగిన తొక్కిసలాటలో మరో 103 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసు మొన్నటి వరకు కోర్టులో నలుగుతూనే ఉంది. 2015 ఆగస్టు 19న ఢిల్లీ కోర్టు థియేటర్ యజమాని సుశీల్ అన్సాల్ సోదరులకు రూ.30 కోట్ల చొప్పున జరిమానా విధించింది. గత ఏడాది నవంబర్‌లో తుది తీర్పు వెలువరించిన కోర్టు.. ఆధారాలను నాశనం చేశారన్న ఆరోపణలపై అన్సాల్ సోదరులకు ఏడేళ్ల జైలు శిక్ష, మరో రూ.2.25 కోట్ల జరిమానా విధించింది. అయితే తాజాగా జరిగిన ఘటన తెల్లవారుజామున జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Also Read
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
Delhi | Fire breaks out at Uphaar cinema hall, near Green Park metro station; 5 fire engines at the spot
The fire broke out in furniture lying inside the cinema hall says the Fire Department. pic.twitter.com/JBC2MSbVI4
— ANI (@ANI) April 17, 2022
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!