ఢిల్లీలోని గ్రీన్ పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉండే ఉపహార్ థియేటర్‌లో ఆదివారం తెల్లవారుజామున మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఐదు ఫైరింజన్‌లతో మంటలు ఆర్పివేశారు. థియేటర్‌లో మూలకు పడి ఉన్న ఫర్నీచర్ కు నిప్పు అంటుకుని మంటలు వ్యాపించాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. థియేటర్‌లోని బాల్కనీ, ఫ్లోర్ బాగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. అయితే 25 ఏళ్ల కిందట ఇదే థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.…