AAP: కాంగ్రెస్‌ని మరోసారి దెబ్బతీసిన ఆప్.. జమ్మూకాశ్మీర్‌లో ఎన్సీకి మద్దతు..
- మరోసారి కాంగ్రెస్‌కి షాక్ ఇచ్చిన ఆప్..
- ఆప్‌తో పొత్తు లేకపోవడంతో హర్యానాలో చేజారిన విజయం..
- జమ్మూ కాశ్మీర్‌లో ఎన్సీకి మద్దతు తెలిపిన ఏకైక ఆప్ ఎమ్మెల్యే..
- కాంగ్రెస్ లేకుండానే మెజారిటీ మార్క్‌ని చేరిన ఎన్సీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: అతివిశ్వాసంతో కాంగ్రెస్ హర్యానాని చేజేతుల చేజార్చుకుంది. తామే గెలుస్తామనే అతి నమ్మకంతో ఆప్ పార్టీలో పొత్తు పెట్టుకోలేదు. దీంతో బీజేపీ వ్యతిరేక ఓటును ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీల్చగలిగింది. దీంతో కేవలం ఒక్క శాతం కన్నా తక్కువ ఓట్లతో బీజేపీ కన్నా 11 సీట్లను వెనకబడింది. ఈ ఎన్నికల్లో ఆప్ 1.79 శాతం ఓట్లను సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో గెలిస్తే, కాంగ్రెస్ 37 స్థానాలు గెలిచి వరసగా మూడోసారి అధికారానికి దూరమైంది. ఆప్ అడిగిన స్థానాలు కాంగ్రెస్ ఇవ్వకపోవడంతో హర్యానా ఎన్నికల్లో విడిగానే పోటీ చేసింది. పొత్తు పెట్టుకోకపోవడంపై కాంగ్రెస్‌ని దాని మిత్ర పక్షాలు కూడా విమర్శిస్తున్నాయి.
Read Also: Minister Narayana: మునిసిపాలిటీలలో ఇంటింటికి తాగునీరు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాం..
Also Read
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
- Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
ఇదిలా ఉంటే, తాజాగా కాంగ్రెస్‌కి ఆప్ మరో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మొత్తం 90 స్థానాలు ఉన్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 46 మ్యాజిక్ ఫిగర్. ఈ ఎన్నికల్లో ఎన్సీ 42, బీజేపీ 29, కాంగ్రెస్ 06 సీట్లను గెలిచింది. అనూహ్యం ఆప్ నుంచి ఒకరు విజయం సాధించారు.
ఇప్పటికే ఎన్సీకి ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. తాజాగా ఆప్ ఎమ్మెల్యే , దోడా నియోజకవర్గం నుంచి గెలిచిన మెహ్రాజ్ మాలిక్ కూడా ఎన్సీకి మద్దతు తెలుపుతూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు మద్దతు లేఖ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ లేకుండానే ఎన్సీ మ్యాజిక్ ఫిగర్ 46ని దాటింది. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మద్దతు చాలా అవసరం. చాలా వరకు అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లోనే ఉంటాయి. కాంగ్రెస్‌తో ఏదైనా విభేదాలు వచ్చినా, ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందే ఎన్సీ సర్దుకుంటోంది.
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!