Gaganyaan: గగన్‌యాన్ ప్రయోగంలో ముందడగు.. మనుషుల్ని అంతరిక్షంలోకి పంపనున్న ఇస్రో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaganyaan: ఇప్పటికే చంద్రయాన్-3ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో మరో ముందడుగు వేసింది. గగన్‌యాన్ ప్రయోగంను విజయవంతంగా కొనసాగిస్తోంది. మానవసహిత అంతరిక్ష యాత్ర కలను సాకారం చేసుకునే దిశగా బుధవారం కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక మిషన్‌లో కీలక పాత్ర పోషించే ప్రొపల్షన్ సిస్టమ్ పనితీరును మెరుగుపరిచేందుకు గానూ చేపట్టిన పరీక్ష విజయవంతమైందని గురువారం ఇస్రో వెల్లడించింది. తమిళనాడు రాష్ట్రం మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. గగన్‌యాన్‌కు సంబంధించిన సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ (ఎస్‌ఎంపీఎస్) పనితీరును శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. ఈ పరీక్షలు ప్రొపల్షన్ పనితీరును ధ్రువీకరిస్తాయి. వీటిలో వచ్చే ఫలితాల ఆధారంగా దాని పనితీరును శాస్త్రవేత్తలు మరింత మెరుగుపరుస్తారు.
Read also: BRO Movie Public Talk: ‘బ్రో’ మూవీ పబ్లిక్ టాక్.. సినిమా ఎలా ఉందంటే..?
Also Read
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
మానవసహిత అంతరిక్ష యాత్రలో భాగంగా ఇస్రో గగన్‌యాన్‌ను ప్రారంభించింది. ఈ యాత్ర మూడు రోజుల పాటు ఉంటుంది. ఈ మిషన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములతో కూడిన వ్యోమనౌకను భూమికి 400 కి.మీ దూరంలోని కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. మూడు రోజుల అనంతరం వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి చేర్చడమే ఇస్రో లక్ష్యం. సర్వీస్ మాడ్యూల్- సిస్టమ్ డిమాన్‌స్ట్రేషన్ మాడల్ (ఎస్‌ఎం-ఎస్‌డీఎం)ఫేజ్-2 టెస్టుల్లో భాగంగా రెండో, మూడో హాట్ టెస్టులను తాజాగా నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని ఇంజిన్ల పనితీరును సమీక్షించారు. థ్రస్టర్ ఇంజిన్లను కంటిన్యూయస్, పల్స్ మోడ్‌లలో విజయవంతంగా పరీక్షించినట్టు ఇస్రో తెలిపింది. ఈనెల 19న మొదటి హాట్ టెస్టును ఇస్రో నిర్వహించింది. వీటితో పాటు మరో మూడు హాట్ టెస్టులను నిర్వహించనున్నట్టు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఈ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ (ఎస్‌ఎంపీఎస్)ను బెంగళూరు, తిరువనంతపురంలోని వలియామలలో ఉన్న లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్లలో అభివృద్ధి చేశారు. ‘తరువాతి పరీక్షలో 350 సెకన్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. తదుపరి పరీక్షను చివరి కక్ష్యను చేరుకునేందుకు వీలుగా నిర్వహించనున్నాం. అందులో భాగంగా ఎల్‌ఏఎం ఇంజిన్లను కంటిన్యూయస్ మోడ్‌లో, ఆర్‌సీఎస్ థ్రస్టర్లను పల్స్ మోడ్‌లో మండించనున్నామని ఇస్రో తెలిపింది.
తాజావార్తలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్‌స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!