Hajj pilgrimage: హజ్ యాత్రలో 98 మంది భారతీయులు మృతి..
- హజ్ యాత్రలో 1000కి పైగా మరణాలు..
- 98 మంది భారతీయులు ఉన్నట్లు కేంద్రం వెల్లడి..
- సహజ కారణాల వల్లనే మరణాలు..
- విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hajj pilgrimage: ఈ ఏడాది హజ్ యాత్రలో యాత్రికులు పిట్టల్లా రాలిపోతున్నారు. విపరీతమైన వేడి కారణంగా వీరింతా ప్రాణాలు వదులుతున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకారం.. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1000ని దాటింది. ఎక్కువగా ఈజిప్టు దేశానికి చెందిన వారే ఉన్నారు. ఈ దేశానికి చెందిన వారు 600కి పైగా ఉన్నారు. ఇదిలా ఉంటే హజ్ యాత్రలో 98 మంది భారతీయులు మరణించినట్లు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అన్ని మరణాలు కూడా ‘‘సహజ కారణాల’’ వల్లనే చోటు చేసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Also: Renu Desai: నేను దురదృష్టవంతురాలినా? ఆ మాట ఎంతో బాధిస్తోంది… రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్‌బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ఈ ఏడాది ఇప్పటి వరకు 1,75,000 మంది భారతీయులు హజ్ యాత్ర కోసం సౌదీకి వెళ్లినట్లు ప్రభుత్వం తెలిపింది. అక్కడికి వెళ్లిన భారతీయుల కోసం చేయగలిగిందంతా చేస్తున్నామని చెప్పింది. ఇస్లాం 5 నియమాల్లో ఒకటైన హజ్ యాత్ర కోసం యాత్రికులు సౌదీకి వెళ్తుంటారు. ఇస్లాం ప్రకారం, ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలి. ఈ ఏడాది సౌదీలో వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయి. ఈ వారం అక్కడ ఉష్ణోగ్రత ఏకంగా 51.8 డిగ్రీలకు చేరుకుంది. తీర్థయాత్ర కోసం గంటల తరబడి ఎండలో నడవడం, ప్రార్థనలు చేయడంతో చాలా మంది అస్వస్థతకు గురై ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!