Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smit Machchhar & Sandra Samuel: ‘విపత్తుల్లోనూ విధిని జయించే ధైర్యం మనుషుల్లో ఉంటుంది’ అని మనం తరచుగా వింటూ ఉంటాం. సరిగ్గా అలాంటి అసాధారణ ధైర్యాన్ని చూపించిన ఒక భారతీయుడి కథే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. అతడే మన భారతీయ పైలట్ స్మిత్ మచ్ఛార్. ఫ్లైదుబాయ్ సంస్థకు చెందిన FZ1073 విమానం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న సమయంలో, వేల అడుగుల ఎత్తులో ఓ ఊహించని ఘోరం జరగబోయింది. కాక్‌పిట్‌లో ఉన్న ఒమన్ దేశానికి చెందిన కో-పైలట్, విమాన కేప్టెన్ అయిన స్మిత్‌పై ఒక పదునైన ఆయుధంతో ఒక్కసారిగా దాడి చేశాడు. అంతేకాదు, విమాన నియంత్రణ వ్యవస్థను (కంట్రోల్ ప్యానెల్) ధ్వంసం చేసి, విమానాన్ని హైజాక్ చేయడానికో లేక క్రాష్ చేయడానికో దారుణమైన యత్నం చేశాడు. అలాంటి తీవ్ర ప్రతికూల పరిస్థితిలోనూ ధైర్యం కోల్పోని స్మిత్, ఆ దాడిని అత్యంత సాహసంతో ఎదుర్కొన్నాడు. సమయస్ఫూర్తితో కాక్‌పిట్ తలుపులు తెరవడంతో విమానంలో ఉన్న కొందరు ఇజ్రాయెల్ ప్రయాణికులు వెంటనే స్పందించి ఆ దుండగుడైన కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలా ఒక పెద్ద ప్రమాదం తపించి, వందలాది ప్రాణాలు గాల్లో కలసిపోకుండా కాపాడబడ్డాయి. ఈ సాహసానికి భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరకు ప్రపంచ దేశాల నేతలంతా స్మిత్‌కు హ్యాట్సాఫ్ చెప్పారు.
అయితే, భారతీయులు ఇలా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇజ్రాయెలీల ప్రాణాలను కాపాడటం ఇదే మొదటిసారి కాదు. దీనికి సరిగ్గా 18 సంవత్సరాల క్రితం, మన దేశంలోనే మరొక అద్భుతమైన సంఘటన జరిగింది. 2008 నవంబర్ 26న ముంబై నగరాన్ని లష్కరే తొయిబా ఉగ్రవాదులు రక్తసిక్తం చేసిన నల్లటి రోజు మనందరికీ గుర్తే. తాజ్ హోటల్, సీఎస్టీ స్టేషన్లతో పాటు కొలాబాలోని నరీమన్ హౌస్ అనే యూదుల సాంస్కృతిక కేంద్రంపైనా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఆ భయంకరమైన దాడి నడుమ, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు సాండ్రా శామ్యూల్ అనే ఒక భారతీయ మహిళ. ఆ నరీమన్ హౌస్‌లో ఇజ్రాయెల్ రబ్బీ గ్యాబ్రియెల్ హోల్ట్జ్బెర్గ్, ఆయన భార్య రివ్కా తమ రెండేళ్ల చిన్నారి మోషే హోల్ట్జ్బెర్గ్తో కలిసి నివసిస్తుండేవారు. అక్కడ సాండ్రా శామ్యూల్ కేర్‌టేకర్ లేదా నానీగా పనిచేసేవారు. దాడి జరిగిన నవంబర్ 26 రాత్రి, విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న ఉగ్రవాదుల బారి నుంచి తప్పించుకోవడానికి సాండ్రా కింద ఉన్న లాండ్రీ గదిలోకి వెళ్లి తలుపులేసుకుని దాక్కున్నారు. రాత్రంతా తుపాకుల మోతలు, భయానక వాతావరణం మధ్యే ఆమె గడిపారు.
Also Read
తీరా తెల్లవారాక, అంటే నవంబర్ 27 ఉదయం, పై అంతస్తు నుంచి ఆ రెండేళ్ల చిన్నారి మోషే ఏడుస్తూ ‘సాండ్రా… సాండ్రా…’ అని పిలుస్తున్న పిలుపులు ఆమెకు వినిపించాయి. పైన ఉగ్రవాదులు సంచరిస్తున్నారని, క్షణాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తెలిసినా, ఆ చిన్నారి ఏడుపు వినలేక సాండ్రా తన ప్రాణాలను లెక్కచేయకుండా పైకి పరుగెత్తారు. అక్కడ ఆమెకు కనిపించిన దృశ్యం గుండెలను పిండేసింది. మోషే తల్లిదండ్రులు రక్తపు మడుగులో స్పృహతప్పి పడి ఉన్నారు. వారి మృతదేహాల పక్కనే కూర్చుని, రక్తంతో తడిసిన ప్యాంటుతో ఆ చిన్నారి అమాయకంగా ఏడుస్తున్నాడు. ఆ క్షణంలో ఆలోచించడానికి కూడా సమయం లేదు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాండ్రా ఆ బాబును పక్కకు తీసి, గట్టిగా గుండెలకు హత్తుకుని, భవనంలో పనిచేసే మరో ఉద్యోగి జాకిర్ హుస్సేన్ సహాయంతో ఉగ్రవాదుల కాల్పుల నడుమ నుంచే బయటకు సురక్షితంగా పరుగెత్తారు. చావు నోటి దాకా వెళ్లి ఆ బాబును సజీవంగా బయటకు తీసుకువచ్చారు.
సాండ్రా చూపించిన ఈ అసామాన్యమైన ధైర్యం, ఆ బాబుపై ఆమెకున్న ప్రేమ ఇజ్రాయెల్ ప్రజల గుండెలను తాకింది. ఆ దేశ ప్రభుత్వం, ప్రజలు ఆమెను ఒక ‘రియల్ హీరో’గా నిలబెట్టారు. ఆ తర్వాత తల్లిదండ్రులను కోల్పోయిన మోషేను చూసుకోవడానికి సాండ్రా కూడా అతడితో పాటు ఇజ్రాయెల్ వెళ్లారు. ఆమె చేసిన ఈ త్యాగానికి గుర్తింపుగా 2010లో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆమెకు పౌరసత్వంతో పాటు శాశ్వత నివాస హోదాను కల్పించింది. అంతేకాదు, యూదేతరులకు ఇచ్చే తమ అత్యున్నత పురస్కారం ‘రైటియస్ అమాంగ్ ది నేషన్స్’తో ఆమెను సత్కరించింది. విధవరాలైన సాండ్రా శామ్యూల్, ఆ చిన్నారి కోసం భారతదేశంలో ఉన్న తన సొంత ఇద్దరు పిల్లలను వదిలి ఇజ్రాయెల్‌కు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె జెరూసలేంలో నివసిస్తూ, దివ్యాంగ పిల్లల కోసం పనిచేసే ‘అలే’ (ALEH) అనే సంస్థలో సేవలు అందిస్తున్నారు. ఇక ఆ చిన్నారి మోషే ఇప్పుడు పెద్దవాడై తన తాతయ్య, అమ్మమ్మలతో కలిసి ఇజ్రాయెల్‌లోనే ఉంటున్నాడు. వయసు మారినా, ప్రాంతాలు మారినా.. ఈ రోజుకీ వీరిద్దరి మధ్య ఉన్నది కన్నతల్లి, కొడుకుల మధ్య ఉండే ప్రేమానురాగాల బంధమే! ఆ రోజు సాండ్రా చూపిన ధైర్యం, ఈ రోజు ఆకాశంలో స్మిత్ చూపిన సమయస్ఫూర్తి.. భారతీయుల రక్తంలో ఉన్న మానవత్వాన్ని, సాహసాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పాయి.
తాజావార్తలు
-
Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!