6 Dead After Two Luxury Travel Buses Collide In Maharashtra Buldhana: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం ఉదయం బుల్దానా జిల్లాలో NH6 రహదారిపై రెండు లగ్జరీ బస్సులు ఎదురెదురుగా గుద్దుకున్నాయి. అర్థరాత్రి 2:30 గంటల ప్రాంతంలో మల్కాపూర్ టౌన్‌లోని ఓ ఫ్లైఓవర్‌పై జరిగిన ఈ యాక్సిడెంట్‌లో 6 మంది స్పాట్‌లోనే చనిపోగా.. 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. గాయాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారిలో నాలుగైది మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
అమర్నాథ్ తీర్థయాత్రలో భాగంగా హింగోళి వెళ్తున్న బస్సు.. నాశిక్‌కి వెళ్తున్న బస్సుని ఢీకొనడంతో, ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. నాశిక్‌కి వెళ్తున్న బస్సు ఒక ట్రక్కుని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించింది. సరిగ్గా అదే సమయంలో హింగోళివైపు వెళ్తున్న బస్సు ఎదురుగా రావడంతో.. రెండూ గుద్దేసుకున్నాయి. రెండు బస్సులు వేగంగా వెళ్తుండటంతో.. డ్రైవర్లు అదుపు చేయలేకపోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందగానే.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా రహదారిపై భారీ ట్రాఫిక్ ఏర్పడటంతో.. రాకపోకలకు అంతరాయం కలిగింది.
Minor Girl Gangrape: మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఆలయం సమీపంలో మైనర్‌పై గ్యాంగ్‌రేప్
ఈ నెల ప్రారంభంలోనూ.. మహారాష్ట్రలో ఓ బస్సు మంటల్లో దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్‌వే పై జరిగిన ఈ ఘటనలో.. మొత్తం 26 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు. ఈ బస్సు యవత్మాల్ నుంచి పూణె వెళ్తున్న సమయంలో, ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బుల్దానా జిల్లాలో శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు.. సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి ప్రమాద స్థలాన్ని సందర్శించారు.