Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- 50 క్వింటాళ్ల నిషేధిత చేపలు సీజ్
- ముగ్గురు వ్యాపారులు అదుపులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Banned Thai Mangur Fish Seized in Katihar: బీహార్‌లోని కతిహార్ జిల్లాలో నిషేధిత చైనీస్ థాయ్ మాంగూర్ చేపల అక్రమ రవాణాపై మత్స్యశాఖ అధికారులు భారీగా దాడులు నిర్వహించారు. రౌతారా టోల్ ప్లాజా సమీపంలో రెండు ట్రక్కులను తనిఖీ చేసిన అధికారులు.. సుమారు 50 క్వింటాళ్ల నిషేధిత చేపలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు చేపల వ్యాపారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి సనత్ కుమార్ సింగ్ ఈ చర్యను ధృవీకరించారు. కోల్‌కతా నుంచి రెండు ట్రక్కుల్లో నిషేధిత చైనీస్ థాయ్ మాంగూర్ చేపలను లోడ్ చేసి పూర్ణియాకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. రౌతారా టోల్ ప్లాజా వద్ద మత్స్యశాఖ బృందం రెండు ట్రక్కులను ఆపి తనిఖీ చేయగా.. భారీగా నిషేధిత చేపలు బయటపడ్డాయి.
ముగ్గురు వ్యాపారులు అదుపులోకి
ఈ కేసులో అభిజీత్ సర్కార్, మహ్మద్ కలీమ్, మహ్మద్ అబ్దుల్లా అనే ముగ్గురు వ్యాపారులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చేపలను ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ అక్రమ రవాణా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? అనే కోణాల్లో అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే విచారణలో ఒక వ్యాపారి చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తాము ప్రతిరోజూ పోలీస్‌స్టేషన్‌ను ‘మేనేజ్’ చేస్తూ నిషేధిత చేపల వ్యాపారం చేస్తున్నామని అతడు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందో ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారణ కాలేదు. వ్యాపారి చేసిన ఈ వ్యాఖ్యలపై కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారంలో ఇతర వ్యక్తులు లేదా ఏదైనా వ్యవస్థ పాత్ర ఉందా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
Also Read
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
- Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
స్వాధీనం చేసుకున్న చేపలు ధ్వంసం
స్వాధీనం చేసుకున్న నిషేధిత చైనీస్ థాయ్ మాంగూర్ చేపలను అధికారులు ధ్వంసం చేశారు. చేపలను తిరిగి మార్కెట్లోకి తరలించకుండా ఉండేందుకు జేసీబీ సహాయంతో భూమిని తవ్వి సుమారు 50 క్వింటాళ్ల చేపలను అందులో వేసి నాశనం చేశారు. రెండు ట్రక్కుల్లో ఇంత భారీ మొత్తంలో నిషేధిత చేపలు పట్టుబడటంతో అక్రమ చేపల రవాణా నెట్‌వర్క్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న మత్స్యశాఖ.. అక్రమ రవాణాకు సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసే పనిలో ఉంది. కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
#WATCH | Katihar, Bihar: The District Fisheries Department seizes 50 quintals of the banned 'Chinese Thai Mangur' fish while being transported from Kolkata to Purnia; three individuals detained.
District Fisheries Officer Sanad Kumar Singh says, "Based on secret intelligence, we… pic.twitter.com/rTl1MUrES9
— ANI (@ANI) September 15, 2026
తాజావార్తలు
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
-
Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
-
Nayeem Mu*rder: నాగోల్‌లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!