Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emmy Awards 2026: లాస్‌ఎంజెల్స్‌లోని పీకాక్ థియేటర్లో 78వ ప్రైమ్‌టైమ్ ఎమ్మీ అవార్డ్స్ (78th Primetime Emmy Awards) వేడుక అత్యంత వైభవంగా ముగిసింది. ఈ ఏడాది అవార్డుల రేసులో సరికొత్త రికార్డులు, హిస్టారికల్ విక్టరీలు టెలివిజన్ ప్రపంచాన్ని షేక్ చేశాయి. ప్రముఖ నటి మార్స్కా హర్గిటే హోస్ట్‌గా వ్యవహరించిన ఈ ఈవెంట్లో సరికొత్త హారర్ కామెడీ సిరీస్ ‘విడోస్ బే’, మెడికల్ డ్రామా ‘ది పిట్’లు ప్రధాన కేటగిరీలను క్లీన్ స్వీప్ చేశాయి. ఈ సారి ఎమ్మీ వేదికపై ఆపిల్ టీవీ ప్లస్ హారర్ కామెడీ సిరీస్ ‘విడోస్ బే’ (Widow’s Bay) ఏకంగా 14 ఎమ్మీ అవార్డులను గెలుచుకుని ఒకే సీజన్ లో అత్యధిక అవార్డులు సాధించిన కామెడీ సిరీస్‌గా ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది. ఇది ‘బెస్ట్ కామెడీ సిరీస్’ అవార్డును కూడా కైవసం చేసుకుంది. ఈ సిరీస్ హీరో మ్యాథ్యూ రిస్ చరిత్రలోనే ఒకే రాత్రి రెండు వేర్వేరు లీడ్ యాక్టర్ కేటగిరీల్లో (బెస్ట్ కామెడీ యాక్టర్ – విడోస్ బే, బెస్ట్ లిమిటెడ్ సిరీస్ యాక్టర్ – ది బీస్ట్ ఇన్ మీ) అవార్డులు గెలుచుకున్న ఏకైక నటుడిగా రికార్డులకెక్కారు. అలాగే లెజెండరీ నటి జీన్ స్మార్ట్ తన ‘హ్యాక్స్’ (Hacks) సిరీస్ ఐదవ సీజన్‌కు గాను వరుసగా ఐదవ సారి బెస్ట్ కామెడీ యాక్ట్రెస్ అవార్డును దక్కించుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.
మరోవైపు అత్యధికంగా 25 నామినేషన్లతో బరిలోకి దిగిన హెచ్‌బీఓ మ్యాక్స్ మెడికల్ థ్రిల్లర్ ‘ది పిట్’ (The Pitt) వరుసగా రెండవ ఏడాది కూడా ‘బెస్ట్ డ్రామా సిరీస్’ ట్రోఫీని గెలుచుకోగా, అందులో నటించిన నోవా వైల్ బెస్ట్ డ్రామా యాక్టర్ అవార్డును అందుకున్నారు. లిమిటెడ్ సిరీస్ కేటగిరీలో ‘డీటీఎఫ్ సెయింట్ లూయిస్’ బెస్ట్ సిరీస్‌గా నిలవగా, ట్విస్టీ సైన్స్-ఫిక్షన్ డ్రామా ‘ప్లూరిబస్’ లోని అద్భుత నటనకు గాను రియా సీహోర్న్ బెస్ట్ డ్రామా యాక్ట్రెస్ అవార్డును సొంతం చేసుకున్నారు. మొత్తంగా చూస్తే 2026 ఎమ్మీ అవార్డ్స్‌లో ‘విడోస్ బే’ రికార్డు స్థాయి విజయంతో హైలైట్‌గా నిలవగా, ‘ది పిట్’ మరోసారి బెస్ట్ డ్రామాగా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్ చరిత్ర సృష్టించడంతో ఈ వేడుక హాలీవుడ్ టెలివిజన్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఇక భారతదేశంలో ఈ అవార్డుల వేడుకను చూడాలనుకునే వాళ్ళు ఈరోజు నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసేయచ్చు.
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
- Tags
- cinema
- Emmy Awards 2026
తాజావార్తలు
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!