Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
- రాజౌరీలో ఉగ్ర మాడ్యూల్ భగ్నం
- ముగ్గురు అనుమానితుల అరెస్ట్, IED స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajouri Terror Module Busted: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజౌరీ జిల్లాలో లష్కర్-ఎ-తైబా (LeT)కు చెందిన ఓవర్‌గ్రౌండ్ వర్కర్ (OGW) నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించినట్లు వెల్లడించారు. అరెస్టైన ముగ్గురు నిందితులు ఉగ్రవాదులకు సహాయకులుగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
ముగ్గురు నిందితుల అరెస్ట్
పోలీసుల వివరాల ప్రకారం అరెస్టైన వారిని జాకిర్ హుస్సేన్, మొహమ్మద్ ఆజం, మొహమ్మద్ ముష్తాక్గా గుర్తించారు. వీరంతా రాజౌరీ జిల్లాకు చెందినవారే.
Also Read
- CM Vijay : రూ.30 బియ్యంపై సీఎం విజయ్‌కు షాక్
- Chandra Kumar Bose: "చరిత్రను వక్రీకరించడం నేరం".. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
- Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎం సానుకూల స్పందన..
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
జాకిర్ హుస్సేన్ – కోట్చర్వాల్ టెరియాత్ ప్రాంతం
మొహమ్మద్ ఆజం – కోట్చర్వాల్ టెరియాత్ ప్రాంతం
మొహమ్మద్ ముష్తాక్ – ఉధాన్ ప్రాంతం
టెర్రర్ మాడ్యూల్ దర్యాప్తులో కీలక పురోగతి
పీర్ పంజాల్ ప్రాంతంలో క్రియాశీలంగా ఉన్నట్లు అనుమానిస్తున్న టెర్రర్ మాడ్యూల్‌పై పోలీసులు చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఈ అరెస్టులు జరిగాయి. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం నిందితులు ఉగ్రవాదులకు లాజిస్టికల్ సపోర్ట్, సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు సహాయం, ఇతర స్థానిక సహకారం అందించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉగ్రవాదులకు గైడ్లుగా పనిచేసినట్లు ఆరోపణలు
దర్యాప్తులో నిందితులు ఉగ్రవాదులకు గైడ్లుగా కూడా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఉగ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు కశ్మీర్ లోయ వైపు వెళ్లేందుకు వీరు సహకరించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. అలాగే పౌరులపై జరిగిన దాడులతో పాటు మరికొన్ని కీలక దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులకు వీరు భౌతికంగా, స్థానికంగా సహాయం అందించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిందితుడి సమాచారం మేరకు IED స్వాధీనం
దర్యాప్తులో భాగంగా ఒక నిందితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు IED (Improvised Explosive Device)ను స్వాధీనం చేసుకున్నారు. ఈ పేలుడు పరికరాన్ని ఒక ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులు నిందితుడి వద్ద భద్రంగా ఉంచేందుకు ఇచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో అనుమానిస్తున్నారు. దీనిని భవిష్యత్తులో లక్ష్యంగా చేసుకున్న దాడికి ఉపయోగించేందుకు ఉంచారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఉగ్రవాద నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెలికితీసేందుకు భద్రతా సంస్థలు విచారణ కొనసాగిస్తున్నాయి.
తాజావార్తలు
-
Hyderabd Metro Phase 2: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
-
Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..
-
Bhuvneshwar Kumar: నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. భువీ ప్రదర్శనపై స్పందించిన బౌలింగ్ కోచ్ మోర్కెల్..
-
Arnab Cyclone Alert: తీరం వైపు వడివడిగా ‘అర్నబ్’.. బీచ్‌కు రావొద్దు.. పర్యాటకులకు మెరైన్ పోలీసుల వార్నింగ్
-
Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
ట్రెండింగ్
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!