Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
- తల్లికి కొడుకు ట్యూషన్
- 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్
- స్ఫూర్తిదాయక కథ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Son Becomes Mother’s Teacher: వయసు చదువుకు అడ్డంకి కాదని నిరూపించారు జమ్మూకు చెందిన 45 ఏళ్ల మహిళ రేణూ హన్స్. మాట్లాడలేని, వినలేని పరిస్థితిలోనూ తన చదువు కలను నెరవేర్చుకున్నారు. తన కొడుకు నమన్ కౌల్ సహాయంతో పదో తరగతి పరీక్షలు రాసి విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం రేణూ హన్స్ పట్టుదలకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలోనూ, ప్రజల్లోనూ ప్రశంసలు అందుకుంటోంది.
కొడుకు నుంచి ట్యూషన్ తీసుకున్న తల్లి
రేణూ హన్స్‌కు చిన్నప్పటి నుంచి చదువుకోవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, పరిస్థితుల కారణంగా ఆమె చదువును కొనసాగించలేకపోయారు. అయితే తన స్నేహితులు, పరిచయస్తులు వివిధ పనులు చేస్తూ ముందుకు వెళ్తుండటాన్ని చూసిన ఆమె.. తాను కూడా ఏదైనా సాధించాలనే పట్టుదలతో పదో తరగతి చదవాలని నిర్ణయించుకున్నారు. తల్లి కోరికను తెలుసుకున్న ఆమె కుమారుడు నమన్ కౌల్ ఆమెకు అండగా నిలిచాడు. తల్లి చదువును కొనసాగించేందుకు వివిధ పాఠశాలల గురించి వివరాలు సేకరించాడు.
Also Read
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
JKOS ద్వారా అడ్మిషన్
నమన్ వివిధ పాఠశాలలను సంప్రదించిన అనంతరం బోర్డును కూడా సంప్రదించాడు. ఈ క్రమంలో Jammu and Kashmir State Open Schooling (JKOS) పథకం గురించి తెలుసుకున్నాడు. అనంతరం తల్లి తరఫున దరఖాస్తు పూర్తి చేసి, ఫీజు చెల్లించి అడ్మిషన్ చేయించాడు. ఆ తర్వాత రేణూ హన్స్ పదో తరగతి చదువును ప్రారంభించారు.
స్కూల్ నుంచి వచ్చాక తల్లికి చదువు చెప్పిన కొడుకు
నమన్ కూడా ప్రతిరోజూ స్కూల్‌కు వెళ్లేవాడు. స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తన తల్లికి కొంత సమయం కేటాయించేవాడు. ఆమెకు పాఠాలు అర్థమయ్యేలా వివరించడంతో పాటు చదువులో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేసేవాడు. తల్లికి అర్థం కాని అంశాలను నమన్ మళ్లీ మళ్లీ వివరించేవాడు. ఇలా కొడుకు సహకారంతో రేణూ పట్టుదలగా చదువును కొనసాగించారు.
ఫలితాలు చూసి కుటుంబం ఆనందం
పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చినప్పుడు రేణూ హన్స్ మంచి ఫలితాలు సాధించారు. దీంతో కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషించారు. బంధువులు, స్నేహితులు కూడా ఆమెను అభినందించి ఆశీర్వదించారు.
సాధారణంగా చిన్నతనంలో పిల్లలు తల్లిదండ్రుల నుంచి చదువులు నేర్చుకుంటారు. కానీ రేణూ హన్స్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. స్కూల్‌కు వెళ్లే ఆమె కొడుకే తన తల్లికి ట్యూషన్ చెప్పి పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించేలా సహాయం చేశాడు. 45 ఏళ్ల వయసులో ఇంటి బాధ్యతలను నిర్వహిస్తూ, వినలేని, మాట్లాడలేని పరిస్థితులను అధిగమించి పదో తరగతి పరీక్షలో విజయం సాధించిన రేణూ హన్స్ పట్టుదల ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆమెకు అండగా నిలిచిన కుమారుడు నమన్ కౌల్‌పై కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
VIDEO | Jammu: With son's help, 45-year-old speech and hearing-impaired Jammu woman, Renu Hans clears class 10.
Naman Koul, Renu Hans's son says, "Mumma used to go to many places with her friends and colleagues. She always felt within herself, 'Why can't I do this? If my… pic.twitter.com/r4H2VoypvF
— Press Trust of India (@PTI_News) September 14, 2026
తాజావార్తలు
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?