Wolf Attacks: నరమాంసానికి మరిగిన తోడేళ్లు.. 24 గంటల్లో ఇద్దరు పిల్లలపై దాడి..
- ఉత్తర ప్రదేశ్‌ని కలవరపెడుతున్న తోడేళ్ల దాడులు..
- నరమాంసానికి అలవాటు పడిన తోడేళ్లు..
- పిల్లలే టార్గెట్‌గా దాడులు.. ఇప్పటి వరకు 8 మంది మృతి..
- 24 గంటల్లో ఇద్దరు పిల్లలపై దాడి..
- ఆరు తోడేళ్లలో నాలుగింటిని బంధించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wolf Attacks: ఉత్తర ప్రదేశ్‌ని నరమాంస భక్షక తోడేళ్లు భయపెడుతున్నాయి. ముఖ్యంగా బహ్రైచ్ జిల్లాలో వరసగా దాడులకు పాల్పడుతున్నాయి. మానవ మాంసానికి మరిగిని తోడేళ్లు చిన్న పిల్లలే టార్గెట్‌గా రాత్రి సమయాల్లో ఊళ్లపై పడుతున్నాయి. బహ్రైచ్ జిల్లాలోని 35 గ్రామాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జూలై 17 నుంచి ఈ తోడేళ్ల దాడుల్లో 8 మంది మరణించారు. మరణించిన వారిలో ఏడుగురు పిల్లలే ఉన్నారు. మరో 30 మమంది వరకు గాయపడ్డారు.
Read Also: PM Modi: బ్రూనై, సింగపూర్ పర్యటనకు ప్రధాని మోడీ..
Also Read
- Mamata Banerjee: "ఇక మేమేంటో చూపిస్తాం".. అల్లుడు అభిషేక్‌పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
- LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- AJMEER MURDER: మొగుడిపై కోపంతో.. అతని కుటుంబాన్ని బలితీసుకున్న మొదటి భార్య..
ఈ తోడేళ్లను పట్టుకునేందుకు వందలాది మంది అటవీ శాఖ అధికారులు, పోలీసులు శ్రమిస్తున్నారు. ఆరు తోడేళ్లు కలిగిన గుంపులో ఇప్పటి వరకు అధికారులు నాలుగింటిని బంధించారు. మరో రెండు మాత్రం యథావిధిగా వేటాడుతున్నాయి. తాజాగా సెప్టెంబర్ 2-3 తేదీల మద్య మరోసారి దాడి జరిగింది. జిల్లాలోని గిర్‌ధార్‌పూర్ ప్రాంతంలో 5 ఏళ్ల బాలికపై దాడి జరిగింది. ఆమె తల, మెడపై గాయాలయ్యాయి. దాడి తర్వాత బాలికనున ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు.
జిల్లా కలెక్టర్ రాణి, ఎస్పీ బృందా శుక్లా బాలిక పరిస్థితిపై ఆరా తీశారు. గత 24 గంటల్లో ఇది రెండో దాడి కావడం గమనార్హం. ఈ తోడేళ్ల దాడులపై యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ మరిన్ని బలగాలను మోహరించాలని ఆదేశించారు. ‘‘ఆపరేషన్ భేదియా’’ కింద నాలుగు తోడేళ్లను పట్టుకున్నారు. రాత్రివేళల్లో అధికారులు గస్తీ పెంచారు. తోడేళ్లను పట్టుకునేందుకు ఏనుగుల పేడ, మూత్రంతో గ్రామాల నుంచి దూరంగా పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. పిల్లలే లక్ష్యం కావడంతో అటవీ అధికారులు పిల్లల సైజులో ఉండే బొమ్మలకు తీసుకువచ్చి, వాటికి పిల్లల మూత్రంలో తడిపి తోడేళ్లను తప్పుదారి పట్టించి, బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Mamata Banerjee: “ఇక మేమేంటో చూపిస్తాం”.. అల్లుడు అభిషేక్‌పై దాడి అనంతరం దీదీ ఆడియో వైరల్..
-
LPG New Rules: LPG కస్టమర్లకు షాక్.. జూన్ 1 నుంచి మీ గ్యాస్ కనెక్షన్ రద్దు కావచ్చు! కేంద్రం కొత్త రూల్స్ ఇవే..
-
RCB vs GT Final: ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. ఐపీఎల్ 2026 విజేత ఎవరు?.. పూర్తి వివరాలు ఇవే!
-
RCB Playing XI: గుజరాత్ టైటాన్స్‌ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్‌లో బిగ్ ఛేంజ్..
-
Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..