Natural gas: భారత్ జాక్‌పాట్ కొట్టింది. దేశంలో మొదటిసారిగా అండమాన్ సముద్రంలో ‘‘సహజ వాయువు’’ నిక్షేపాలను కనుగొంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ శ్రీ విజయపురం-2 బావి వద్ద గ్యాస్‌ను కనుగొంది. ప్రారంభ టెస్టుల్లో 87 శాతం మీథేన్ ఉన్నట్లు తేలింది. గతంలో ఈ ప్రాంతంతో సంభావ్య చమురు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థను, ఇంధన మార్కెట్‌ను గణనీయంగా మారస్తుంది.
Oil Discovery: ముడి చమురు దిగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. ఆయిల్ దిగుమతుల్లో అమెరికా, చైనా తర్వాత మూడో స్థానంలో భారత్ ఉంది. ముఖ్యంగా దేశీయ అవసరాల కోసం 85 శాతం ఆయిల్‌ని మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలు చూస్తే భారత్ జాక్‌పాట్ కొట్టినట్లు తెలుస్తోంది.
ఫిలిప్పీన్స్‌లోని (Philippines) మిండానావో, అండమాన్ సముద్రం (Andaman sea)లో భారీ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. ఫిలిప్పీన్స్‌లోని మిండానావోలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
Earthquake: అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలోని అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. ఆదివారం సాయంత్రం రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ(ఎన్‌సీఎస్) ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ రోజు రాత్రి 7.36 గంటలకు 120 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని వెల్లడించింది. దీనికి ముందు గురువారం జమ్మూ కాశ్మీర్ లోని దోడాలో 3.9 తీవ్రతతో భూకంపం వచ్చింది.
Earthquake: ఈ రోజు తెల్లవారుజామున అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడిచింది. అండమాన్ సముద్రంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలిపింది. ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.