Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News 33 Demise As Heavy Rain Causes Flash Floods Landslides In Several States

Heavy Rains: నాలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న వర్షాలు.. 33 మంది మృతి

Published Date :August 21, 2022 , 10:31 am
By Mahesh Jakki
Heavy Rains: నాలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న వర్షాలు.. 33 మంది మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Heavy Rains: హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో వరుణుడి బీభత్సం కొనసాగుతోంది. ఆకస్మిక వరదలు హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఇటు ఒడిశా, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లోనూ వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో శనివారం 33 మంది మరణించారు.

హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు రావడంతో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సహా మొత్తం 22 మంది చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు సంబంధించిన ఘటనల్లో 10 మంది గాయపడగా, మండీలో ఆరుగురు గల్లంతయ్యారని డిప్యూటి కమిషనర్ అరిందమ్ చౌదరి వెల్లడించారు.

ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్ కారణంగా నలుగురు మృతి చెందగా, 10 మంది గల్లంతయ్యారు. నదులు ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో పాటు వంతెనలు కొట్టుకుపోవడంతో పలు గ్రామాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Extortion Scam: రూ.500 కోట్ల ఇన్‌స్టంట్ రుణాల కుంభకోణం.. తెర వెనుక చైనా ప్రమేయం

ఒడిశాలోని 500 గ్రామాలలో దాదాపు 4.5 లక్షల మంది ప్రజలు ఇప్పటికే వరదలతో అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో, నలుగురు మరణించినట్లు అధికారులు నివేదించారు. రాష్ట్ర ప్రభుత్వం మయూర్‌భంజ్, కేంద్రపారా మరియు బాలాసోర్‌తో సహా పలు జిల్లాల్లో రెస్క్యూ, రిలీఫ్ టీమ్‌లను మోహరించింది. శనివారం మహానదిలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన పడవలో 70 మంది సురక్షితంగా బయటపడ్డారు.

భారీ వర్షం కారణంగా జార్ఖండ్‌లోని పలు జిల్లాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పశ్చిమ సింగ్‌భూమ్‌లో తన ఇంటి మట్టి గోడ ఆమెపై పడటంతో ఒక మహిళ మరణించగా, రామ్‌గఢ్ జిల్లాలో ఉబ్బిన నల్కారి నదిలో ఇద్దరు వ్యక్తులు మునిగిపోయారు.

జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో వైష్ణో దేవి యాత్ర ఈ ఉదయం తిరిగి ప్రారంభమైంది. భారీ వర్షం కారణంగా తీర్థయాత్రకు వెళ్లే దారిలో వరదలు బీభత్సం సృష్టించడంతో రాత్రిపూట యాత్ర తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఆదివారం పశ్చిమ మధ్యప్రదేశ్‌లో, సోమవారం తూర్పు రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • floods in several states
  • Heavy rains
  • heavy rains in himachal pradesh
  • Jharkhand
  • Odisha

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions