BJP: మోడీ @ ది టెర్మినేటర్.. 2024లో మళ్లీ నేనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: 2024 లోక్‌సభ ఎన్నికలకు మరెంతో కాలం లేదు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావాలని అనుకుంటుంటే.. ప్రధాని మోడీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ తో పాటు 26 పార్టీలు ఇండియా పేరుతో కొత్త కూటమి కట్టాయి.
ఇదిలా ఉంటే ముంబై వేదికగా రేపు, సెప్టెంబర్ 1న ఇండియా కూటమి తన మూడో సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఇండియా కూటమికి ప్రతిగా బీజేపీ వినూత్న ప్రచారం చేపట్టింది. ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ నటించిన ‘టెర్మినేటర్’ సినిమాతో ప్రధాని మోడీకి బీజేపీ ప్రచారం చేస్తోంది. మోడీ ఫోటోను పెట్టి, సినిమాలోని డైలాగ్ ని తలపించేలా..‘‘2024! నేను తిరిగి వస్తాను!’’ అంటూ పోస్టర్ ని బీజేపీ ట్వీట్ చేసింది.
Also Read
- DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్‌పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
- INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్‌కాట్..
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
Read Also: Bandi Sanjay: తెలంగాణలో గెలిచేది బీజేపీ పార్టీనే..
ఇండియా కూటమికి వ్యతిరేకంగా 2024 ఎన్నికల్లో గెలిచి నరేంద్రమోడీనే మళ్లీ అధికారంలోకి వస్తారంటూ ప్రచారం చేస్తోంది కాషాయపార్టీ. ‘‘ప్రతిపక్షాలు ప్రధాని మోడీని ఓడించవచ్చని భావిస్తున్నాయి, కలలు కనండి! టెర్మినేటర్ ఎల్లప్పుడూ గెలుస్తాడు’’ అంలటూ బీజేపీ అధికార సోషల్ మీడియా అకౌంట్స్ లో ఈ పోస్టర్ ని షేర్ చేస్తున్నాయి.
మరోవైపు ఇండియా కూటమి రేపు, ఎల్లుండి ముంబైలో సమావేశం కానుంది. కూటమిలోకి మరిన్ని పార్టీలు చేరుతాయని పలువురు నేతలు చెబుతున్నారు. రేపటి సమావేశంలో జెండా, ఎజెండా ఖరారవుతుందని సమాచారం. ఇదిలా ఉంటే బీజేేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కూడా ముంబై వేదికగా బలప్రదర్శనకు సిద్ధమవుతోంది. ఇటీవల ఎన్డీయేలో చేరిన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గాన్ని స్వాగతించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
తాజావార్తలు
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్‌పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
-
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్‌కాట్..
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
-
Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!