Terror Attack In J&K: జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదుల దాడి..
- జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు వలస కూలీలపై ఉగ్రదాడి..
- బాధితులను శ్రీనగర్ లోని జేవీసీ ఆస్పత్రిలో చేర్చిన స్థానికులు..
- గత 12 రోజుల్లో సెంట్రల్ కశ్మీర్ లో స్థానికేతరులపై ఇది రెండో దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terror Attack In J&K: జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో శుక్రవారం ఇద్దరు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన సోఫియాన్ (25), ఉస్మాన్ మాలిక్ (25) శ్రీనగర్‌లోని జెవీసీ ఆసుపత్రి బెమీనాలో చేర్చారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. కాగా, ఇద్దరూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరాన్‌పూర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అయితే, సోఫియాన్, ఉస్మాన్ అనే కార్మికులు జలశక్తి శాఖలో రోజువారీ కూలీగా పని చేస్తున్నారు. ఇక, కాల్పుల గురించి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత 12 రోజుల్లో సెంట్రల్ కశ్మీర్లో స్థానికేతరులపై ఇలాంటి దాడి జరగడం ఇది రెండోసారి.
Also Read
- PM Modi: "నీట్ పేపర్ లీక్ 'ఘోర పాపం'.. కఠిన శిక్ష తప్పదు".. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
- Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
అయితే, ఇంతకు ముందు.. జమ్మూ కాశ్మీర్లో స్థానికేతరులపై దాడి గందర్బాల్ జిల్లాలోని సోనామార్గ్ ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక వైద్యుడితో పాటు ఆరుగురు వలస కార్మికులు మరణించిన 12 రోజులు అయింది. ఆ ఘటనలో దాడికి గురైన డాక్టర్, కార్మికులు సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బాల్‌లోని గగనీర్‌ను సోనామార్గ్‌కు కలిపే Z-మోర్హ్ సొరంగంపై పని చేస్తున్న నిర్మాణ బృందంలో భాగం. అక్టోబర్ 18న షోపియాన్ జిల్లాలో బీహార్‌కు చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు హతమార్చారు. తరచుగా వలస కార్మికులపై ఉగ్రదాడులు జరగడంపై భద్రతా బలగాలు టెర్రరిస్టుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
-
PM Modi: “నీట్ పేపర్ లీక్ ‘ఘోర పాపం’.. కఠిన శిక్ష తప్పదు”.. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Maruthi Next : మారుతీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. అవసరమా అధ్యక్ష్యా?
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?