Google Maps: గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకుంటే, నట్టేట ముంచేసింది..
- గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకుంటే నదిలోకి తీసుకెళ్లింది..
- కేరళ కాసర్‌గోడ్ జిల్లాలో ఘటన..
- ఇద్దరిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Maps: ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకుని వెళ్తే కొన్ని ప్రమాదాలు జరిగిన సంఘటనలు చూస్తున్నాం. తాజాగా కేరళలో ఇలాంటి ఘటనే జరిగింది. గూగుల్ తల్లిని నమ్ముకుంటే నట్టేట ముంచింది. చివరకు బాధితులు ప్రాణాలతో బయటపడ్డారు. కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో గమ్యస్థానం చేరేందుకు నావిగేషన్ మ్యాప్స్ పెట్టుకుని కారును నడుపుతున్న సమయంలో, కారు నేరుగా నదిలోకి వెళ్లింది. కారు చెట్టుకు ఇరుక్కుపోవడంతో అందులో ఉన్న వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు.
Read Also: Honour Killing: తాగుదామని పిలిపించి అల్లుడిని చంపేసిన కుటుంబం.. సంచలనంగా ‘‘పరువు హత్య’’
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
నీటి ప్రవాహానికి దూరంగా ఉన్న వారి వాహనం చెట్టుకు ఇరుక్కుపోవడంతో కారులో ఉన్న వారు ఫైర్ సిబ్బందిని సంప్రదించారు. దీంతో బాధితులను సురక్షితంగా రెస్క్యూ చేశారు. ఇప్పుడు వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాధితుల్లో ఒకరైన అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ గూగుల్ మ్యాప్స్ ఇరుకైన రోడ్డును చూపించిందని, దాని గుండా కారు వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. వాహనం హెడ్‌లైట్లను బట్టి చూస్తే కొంచెం నీరు ఉన్నట్లు భావించామని, కానీ రెండు వైపుల నది మధ్యలో వంతెన ఉన్నట్లు చూడలేదని, వంతెనకు సైడ్ వాల్ కూడా లేదని చెప్పారు.
కారు అకాస్మత్తుగా నీటి ప్రవాహంలో చిక్కుకుందని, కారు నది ఒడ్డున ఉన్న చెట్టుకు చిక్కుకుందని బాధితులు వెల్లడించారు. సమయానికి కార్ డోర్ తెరిచి సాయం కోసం అగ్నిమాపక సిబ్బందిని సంప్రదించి లొకేషన్ పంపించినట్లు వారు తెలిపారు. కారులో ఇరుక్కున్న ఇద్దరిని సురక్షితంగా రక్షించామని ఫైర్ సిబ్బంది వెల్లడించింది. ఇది తమకు పునర్జన్మ అని రషీద్ చెప్పారు. గత నెలలో హైదరాబాద్‌కి చెందిన పర్యాటకుల బృందం ఇలాగే కొట్టాయంలోని కురుప్పంతర సమీపంలో ప్రవాహంలోకి తీసుకెళ్లింది. ఈ ఘటనలో కూడా గూగుల్ మ్యాప్స్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో స్థానికుల సాయంతో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
- Tags
- Google Maps
- Kerala
- viral news
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..